
స్ట్రీట్ ఫైట్ ఘటనలో నలుగురు విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో విషాదం నింపిన స్ట్రీట్ ఫైట్ ఘటనకు సంబంధించి నలుగురు విద్యార్థులను ఆదివారం మధ్యాహ్నం సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో జరిగిన స్ట్రీట్ ఫైట్ లో నబిల్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన వారం రోజుల క్రితమే జరిగినా.. దాన్ని బైక్ యాక్సిడెంట్ గా చిత్రీకరించారు అతని స్నేహితులు. అయితే తాజాగా బయటకు వచ్చిన వీడియోలో మాత్రం నబిల్ ను కొట్టిచంపినట్లు స్పష్టంగా కనబడింది.
కొడుకు చనిపోయిన తీరుపై తండ్రి యూసఫ్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.