ప్రపంచంలోని చాలా నగరాల్లో బహుభాషలు వినిపిస్తుంటాయి. నగర విస్తీర్ణం, ప్రాధాన్యం బట్టి అలా వినిపించే భాషలు పదుల సంఖ్యలో ఉండటమూ మామూలే! చిన్నా చితకా పట్టణాల్లోనైతే సాధారణంగా రెండు మూడు భాషలు; మహా అయితే, అరడజను భాషలు వినిపిస్తాయి. బ్రిటన్‌లోని ఒక చిన్న నగరంలో ఉన్న ఆ వీథి భాషావైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ వీథిలోకి అడుగుపెడితే, ఏకంగా డెబ్బయి భాషలు వినిపిస్తాయి. ఇంతటి భాషా వైవిధ్యమున్న వీథి ప్రపంచంలోని మరే నగరంలోనూ, పట్టణంలోనూ లేదు. ఇంతటి వైవిధ్యభరితమైన వీథి బ్రిటన్‌లోని గ్లూసెస్టర్ నగరంలో ఉంది.
ఈ నగర జనాభా 1.32 లక్షలు. ఈ నగరంలోని బార్టన్ స్ట్రీట్‌లో రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన వారు, నానా దేశాల వారు నివాసం ఉంటుంటారు. ఈ వీథి సందుల్లో పేదలు ఉండే నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ స్థానిక ఇంగ్లిష్ ప్రజలతో పాటు తూర్పు యూరోప్‌లోని నానా దేశాల వారు, కరీబియన్ దీవుల నుంచి వచ్చినవారు, ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన వారు, మన భారతీయులు ఉంటుంటారు. ఈ వీథిలో పశ్చిమాసియా నుంచి వలస వచ్చిన ముస్లింలు పెద్దసంఖ్యలోనే కనిపిస్తారు. ఇక్కడి వారు బయట ఇంగ్లిష్ మాట్లాడినా, ఇళ్లల్లో తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ వీథిలో కనిపించే భాషావైవిధ్యం ఇంకెక్కడా కనిపించదని ఇక్కడి స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment