మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్‌లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్‌గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment