బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..? | Biryani Flavoured Ice Cream At Dubai Mall Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..?

Published Thu, Nov 7 2024 12:48 PM | Last Updated on Thu, Nov 7 2024 5:47 PM

Biryani Flavoured Ice Cream At Dubai Mall Goes Viral On Social Media

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అయితే ఇప్పుడు వాటిలో రకరకాల ప్లేవర్‌లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని టేస్ట్‌ బానే ఉన్నా చాలావరకు అంత బాగోవు. పండ్లు నుంచి స్వీట్స్‌తో తయారు చేసే ఎన్నో ఐస్‌క్రీంలు చూశాం కానీ ఇలాంటి ప్లేవర్డ్‌ ఐస్‌క్రీం మాత్రం చూసుండరు. అదికూడా అందరూ ఇష్టపడే బిర్యానీతో ఐస్‌క్రీం అంటే బాబోయ్‌ అనిపిస్తుంది కదూ..!. ఎలా ఉంటుందనే కదా డౌటు..?

ఆకాశ్‌ మెహతా అనే సోషల్‌ మీడియా ఔత్సాహికుడు నెట్టింట ఒక రీల్‌ పోస్ట్‌ చేశాడు. అందుకోసం అని ఓ దుబాయ​ మాల్‌లోని ఐస్‌క్రీం స్టాల్‌లో వివిధ ఫ్లేవర్డ్‌ల ఐస్‌క్రీంలను ట్రై చేశాడు. ఆ దుకాణంలోని మెనూలో తనకు నచ్చిన కొన్ని ఐస్‌క్రీంలు సెలక్ట్‌ చేసుకున్నాడు. వాటి పేర్లు వరుసగా కెచప్, చిప్స్, బిర్యానీ, ఆలివ్ ఆయిల్, చాయ్ వంటి ఫ్లేవర్డ్‌ ఐస్‌క్రీంలు. 

ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రై చేసి చూస్తున్నాడు. ముందుగా కెచప్‌ రుచి చూడగా..ఎలా ఉందనేది చెప్పలేను అని అన్నాడు. ఇక బిర్యానీ ప్లేవర్‌ చూడగానే ఈ ఐస్‌క్రీం కచ్చితంగా హిట్‌ అవుతుందని కితాబు ఇచ్చేశాడు. ఇక ఆలివ్‌ అద్భుతం అని, చిప్స్‌ ఆశ్చర్యపరిచేలా ఉందని, చాయ్‌ ఐస్‌క్రీం మాత్రం తనకిష్టమైన ఫ్లేవర్‌ అంటూ ఆ ఐస్‌క్రీంల రుచుల గురించి చెప్పుకొచ్చాడు. కానీ నెటిజన్లుమాత్రం ఇవేం ఐస్‌క్రీం ఫ్లేవర్డ్‌లు అని ఆకాశ్‌ పోస్ట్‌కి కామెంట్లు చేస్తున్నారు. 

(చదవండి: ‘బైక్‌ పింక్‌ సర్వీస్‌': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement