Indian Entrepreneur And Family On Meeting Dubai Ruler In Elevator - Sakshi
Sakshi News home page

ఓ దేశానికి హాలిడే ట్రిప్‌గా వెళ్లితే.. ఆ దేశ అధ్యక్షుడి సడెన్ ఎంట్రీతో..

Published Tue, Jul 18 2023 1:15 PM | Last Updated on Tue, Jul 18 2023 1:27 PM

Indian Entrepreneur And Family On Meeting Dubai Ruler In Elevator - Sakshi

భారత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం హాలిడే ట్రిప్‌ కింద దుబాయ్‌కి వెళ్లింది. ఆ కుటుంబం అక్కడ ఎంజాయ్‌ చేస్తుండగా.. సడెన్‌గా అనుకోకుండా ఆ దేశ అధ్యక్షుడు వారిని కలిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే చాలా థ్రిల్‌గా ఉంటుంది. నిజమా కలా? అన్నంత కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. అలాంటి అనుభూతినే ఈ పారిశ్రామికవేత్త కుటుంబం పొందింది.

అసలేం జరిగిందంటే..భారతీయ వ్యాపారవేత్త అనాస్‌ రెహాన్‌ జునైద్‌, అతడి కుటుంబం హాలిడే ట్రిప్‌గా దుబాయ్‌కి వెళ్లారు. ఆ కుటుంబం చక్కగా ఎంజాయ్‌ చేస్తుండగా సడెన్‌గా అనుకోని రీతిలో దుబాయ్‌ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ అతడి సహచరులని కలిశారు. ఆ కుటుంబం లిప్ట్‌లో వెళ్తుండగా సడెన్‌గా ఈ ఘటన ఎదురవ్వడం విశేషం. వారు వెళ్తున్న అదే లిఫ్ట్‌లోకి ఆ దేశ అధ్యక్షుడు అతని పరివారం వచ్చారు.

దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయింది. సదరు వ్యాపారవేత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని తన కూతుర్ని అడిగాడు. అంతేగాదు ఆ అధ్యక్షుడితో ఫోటోలు తీసుకునేందుకు అనుమతి కోరగా..నవ్వుతూ ఫోజులివ్వడమే గాక వారితో కాసేపు ముచ్చటించాడు షేక్‌. మేము నిజంగా అతన్ని కలుసుకున్నామా ఇది నమ్మలేకపోతున్నాం అంటూ భావోద్వేగానికి గురైంది ఆ కుటుంబం. షేక్‌ని కలిసేలా చేసిని ఆ లిఫ్ట్‌ తమకు ప్రత్యేకమని, ప్రపంచంలోని అన్ని లిఫ్ట్‌ల కంటే అదే మాకు ఇష్టమని చెప్పారు. ఈ మేరకు పారిశ్రమికవ వేత్త ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

(చదవండి:  గూగుల్‌ డూడుల్‌లో ఉ‍న్న వ్యక్తి ఎవరు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement