Sheikh Mohammed bin Rashid Al makdum
-
హాలిడే ట్రిప్‌కి దుబాయ్ వెళ్లితే..సడెన్‌గా ఆ దేశ అధ్యక్షుడి ఎంట్రీతో..
భారత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం హాలిడే ట్రిప్ కింద దుబాయ్‌కి వెళ్లింది. ఆ కుటుంబం అక్కడ ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా అనుకోకుండా ఆ దేశ అధ్యక్షుడు వారిని కలిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే చాలా థ్రిల్‌గా ఉంటుంది. నిజమా కలా? అన్నంత కన్ఫ్యూజన్లో ఉంటాం. అలాంటి అనుభూతినే ఈ పారిశ్రామికవేత్త కుటుంబం పొందింది. అసలేం జరిగిందంటే..భారతీయ వ్యాపారవేత్త అనాస్ రెహాన్ జునైద్, అతడి కుటుంబం హాలిడే ట్రిప్‌గా దుబాయ్‌కి వెళ్లారు. ఆ కుటుంబం చక్కగా ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా అనుకోని రీతిలో దుబాయ్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అతడి సహచరులని కలిశారు. ఆ కుటుంబం లిప్ట్‌లో వెళ్తుండగా సడెన్‌గా ఈ ఘటన ఎదురవ్వడం విశేషం. వారు వెళ్తున్న అదే లిఫ్ట్‌లోకి ఆ దేశ అధ్యక్షుడు అతని పరివారం వచ్చారు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయింది. సదరు వ్యాపారవేత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని తన కూతుర్ని అడిగాడు. అంతేగాదు ఆ అధ్యక్షుడితో ఫోటోలు తీసుకునేందుకు అనుమతి కోరగా..నవ్వుతూ ఫోజులివ్వడమే గాక వారితో కాసేపు ముచ్చటించాడు షేక్. మేము నిజంగా అతన్ని కలుసుకున్నామా ఇది నమ్మలేకపోతున్నాం అంటూ భావోద్వేగానికి గురైంది ఆ కుటుంబం. షేక్‌ని కలిసేలా చేసిని ఆ లిఫ్ట్ తమకు ప్రత్యేకమని, ప్రపంచంలోని అన్ని లిఫ్ట్‌ల కంటే అదే మాకు ఇష్టమని చెప్పారు. ఈ మేరకు పారిశ్రమికవ వేత్త ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anas Rahman Junaid (@a.r.junaid) (చదవండి: గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరు?) -
పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త
దుబాయ్: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయా బింట్, ఆమె న్యాయవాదుల ఫోన్లను హ్యాక్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. వారి పిల్లల కస్టడీకి సంబంధించిన ఇంగ్లండ్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్ కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని విచారణలో భాగంగా మొహమ్మద్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయాను వెంటాడి.. బెదిరింపులకు గురి చేసినట్లు ఇంగ్లండ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రిన్సెస్ హయా ఫోన్ హ్యాక్ చేయడం కోసం మహమ్మద్ అధునాతన "పెగసస్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ జాతీయ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి దేశాల కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. ఇది మనదేశలో కూడా పెగాసస్ పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొహమ్మద్.. తన మాజీ భార్య, జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి ప్రిన్సెస్ హయా బింట్ అల్-హుస్సేన్‌తో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నట్లు తెలిసింది (చదవండి: మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..) మొహమ్మద్ కోసం పనిచేస్తున్న వారు బ్రిటిష్ రాజధాని సమీపంలోని హయా ఎస్టేట్‌కి ప్రక్కనే ఒక భవంతిని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యలను ఇంగ్లండ్ కోర్టు తప్పుపట్టింది. హయాను వెంటాడే ఈ చర్యల వల్ల ఆమె ఎంతో అసురక్షితంగా ఫీలవుతుందని.. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది అని కోర్టు అభిప్రాయపడింది. మొహమ్మద్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాడని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడమే కాక వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించిన 19 నెలల తర్వాత తాజాగా తీర్పులు వెల్లడించింది. ఈ సందర్భంగా "తాజాగా వెల్లడయిన అంశాలు విశ్వాసాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి" అని ఇంగ్లండ్, వేల్స్‌లోని కుటుంబ విభాగం అధ్యక్షుడు జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. (చదవండి: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు.. ) మొహమ్మద్ షేక్ కోర్టు తీర్మానాలను తిరస్కరించారు, అవి అసంపూర్ణ వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "నాపై చేసిన ఆరోపణలను నేను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను.. ఇప్పుడు కూడా అదే చేస్తాను" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్ల క్రితం హయా(47), తన ఇద్దరు పిల్లలు జలీలా(13), జాయెద్‌లను తీసుకుని బ్రిటన్ పారిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీకి సంబంధించి మొహమ్మద్, హయాల మధ్య సుదీర్ఘమైన, ఖరీదైన న్యాయపోరాటం జరుగుతుంది. అంతేకాక హయా తన బ్రిటిష్ అంగరక్షకులలో ఒకరితో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హ్యాకింగ్‌కు గురి అయిన వారిలో హయా తరఫు న్యాయవాది ఫియోనా షాక్లెటన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్) హ్యాకింగ్ వార్తలు వెలుగు చూసిన తర్వాత పెగసస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని.. యూఏఈతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎన్ఎస్ఓ వెల్లడించినట్లు హయా తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై ఎన్ఎస్ఓ స్పందించలేదు. చదవండి: ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది -
నా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది: రాకుమార్తె
దుబాయ్: ‘‘ఈ విల్లా ఓ జైలులా మారిపోయింది. నేను బందీగా పడి ఉన్నాను’’ అన్న దుబాయ్ యువరాణి షికా లతీఫా మాటలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. బాతూరూంలో ఓ మూలన నక్కి ఆమె రోదిస్తున్న తీరు ఎడారి దేశంలో మహిళలకు ఉన్న కట్టుబాట్ల గురించి మరోసారి చర్చకు దారి తీసింది. యువరాణిగా పుట్టినందుకు తనకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడేందుకు రెండేళ్ల క్రితం లతీఫా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ ప్రధాని, రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె అయిన ఆమె... అమెరికాలో ఆశ్రయం పొందాలనే యోచనతో అధికారుల కళ్లు గప్పి పడవలో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి మరపడవలో బయల్దేరారు. ఈ క్రమంలో ఆమెను భారత్‌లోని గోవా తీర ప్రాంతానికి చేరుకున్న యూఏఈ అధికారులు అక్కడి నుంచి తిరిగి దుబాయ్ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ప్రోగ్రాం పనోరమలో భాగంగా బీబీసీ మంగళవారం మరో క్లిప్‌ను మంగళవారం విడుదల చేసింది. ‘‘ఇక్కడ నేనొక ఖైదీని. జైలులాంటి విల్లాలో నేను ఉండలేను. ఇంటి ముందు ఓ ఐదుగురు పోలీసులు, ఇంట్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. నా భద్రత, నా జీవితం గురించి ప్రతిరోజూ ఆందోళన చెందుతూనే ఉన్నాను. రోజురోజుకీ నా పరిస్థితి దిగజారిపోతోంది. ఈ జైలులో బతకలేను. నాకు స్వేచ్ఛ కావాలి’’ అని లతీఫా బాధతో అంటున్న మాటలు ఈ క్లిప్‌లో వినిపించాయి. అయితే దీనిని ఎప్పుడు రికార్డు చేశారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా గోవా తీరం నుంచి లతీఫాను వెనక్కి తీసుకువచ్చిన తర్వాత, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్ దుబాయ్ రాజు ఇంట్లో ఆమెను కలిశారు. వీరిద్దరు కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు విడుదల చేయడం ద్వారా లతీఫా క్షేమంగానే ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ తనను బందీగానే ఉంచారంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్ -
బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్
దుబాయ్: దుబాయ్ పాలకుడి భార్య ఆమె బాడీగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీని గురించి బయటకు వెళ్లడించకుండా ఉండటానికి అతడికి భారీ ఎత్తున నగదు.. ఖరీదైన బహుమతులు ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మెయిల్ ఆన్లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బ్రిటీష్ బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నెరపుతుంది. దీని గురించి రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2మిలియన్ డాలర్ల నగదు(రూ. 8,88,59,400)తోపాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్, అరుదైన షాట్‌గాన్ ఇచ్చినట్లు మెయిల్ ఆన్లైన్ వెల్లడించింది. రస్సెల్ భార్య మాట్లాడుతూ.. ‘హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతలు ఇచ్చి లొంగదీసుకుంది.. తనని ఆమె దగ్గరే ఉంచుకుంది’ అని తెలిపింది. వీరిద్దరి బంధం గురించి తెలియడంతో రస్సెల్ భార్య ఎంతో బాధపడిందని.. వారి నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యిందని మెయిల్ ఆన్లైన్ తెలిపింది. (ఫేస్‌మాస్క్‌లు చోరీ : సంచలన తీర్పు) ప్రిన్సెస్ హయా, ఆమె 70 ఏళ్ల మాజీ భర్త మధ్య హైకోర్టు విచారణ సందర్భంగా బాడీగార్డుతో ఆమెకున్న రహస్య సంబంధం వెలుగులోకి వచ్చింది. లండన్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్‌లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్ హయా తన మగ అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని దీనిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్ లండన్‌లోని కెన్సింగ్టన్లో నివాసం ఉంటున్నారు. -
యూఏఈ ప్రధానికి ట్రయల్ కరోనా వ్యాక్సిన్
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం కరోనా వైరస్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకుంటున్నప్పుడు అంటూ ఒక చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. యూఏఈలో భవిష్యత్ తుఎపుడూ బావుంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వ్యాక్సిన్ దేశ చట్టాలకు అనుకూలంగా ఉందని దేశ ఆరోగ్య మంత్రి అబ్దుల్ రెహ్మాన్ అల్-ఓవైస్ ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తనకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నట్లు ట్విటర్లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసారు. రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నా.. ప్రతి ఒక్కరికీ భద్రత, గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వాలన్ని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. యుఎఈలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన తమ బృందాలను చూసి గర్వంగా ఉందన్నారు. కాగా గత కొన్ని వారాలుగా కొంతమంది యుఏఈ మంత్రులు కూడా కరోనా టీకా షాట్స్ తీసుకున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉన్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులకు ట్రయల్ వ్యాక్సిన్‌కు సెప్టెంబర్‌లో యుఏఈ అత్యవసర అనుమతి ఇచ్చింది. ఆరోగ్య కార్యకర్తల రక్షణ, భద్రత కోసం దేశం తీసుకున్న చర్యలలో భాగంగా టీకా అత్యవసర వాడకానికి యుఎఈ అనుమతించింది. గత నెల ప్రారంభంలో, దేశ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ట్రయల్ కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకున్న సంగతి తెలిసిందే. While receiving the COVID-19 vaccine today. We wish everyone safety and great health, and we are proud of our teams who have worked relentlessly to make the vaccine available in the UAE. The future will always be better in the UAE. pic.twitter.com/Rky5iqgfdg — HH Sheikh Mohammed (@HHShkMohd) November 3, 2020 -
బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి
లండన్: దుబాయ్ రాజుతో తనకు జరిగిన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయనకు దూరంగా ఉంటున్న భార్య, రాకుమారి హయా (45) లండన్ కోర్టును ఆశ్రయించారు. తన పిల్లల సంరక్షణ బాధ్యతలు తనకే అప్పగించాలని, అదేవిధంగా తనపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలని ఆమె ఇంగ్లండ్, వేల్స్ హైకోర్టు ఫ్యామిలీ డివిజన్‌ను అభ్యర్థించారు. దుబాయ్ రాజు, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రధాని అయిన 70 ఏళ్ల షేక్ మహమ్మద్ బిన్ రషిద్ ఆల్ మక్తూమ్ను వదిలేసి పిల్లలతో సహా పారిపోయి వచ్చిన హయా ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే విషయమై ఇద్దరి మధ్య ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగుతోంది. దివంగత జోర్డాన్ రాజు హుస్సేన్ కూతురు, జోర్డాన్ ప్రస్తుత రాజు అబ్దుల్లా-2 సవతి సోదరి అయిన హయా తన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం బలవంతపు పెళ్లిని ఆపవచ్చు. ఒకవేళ బలవంతపు పెళ్లి ఇప్పటికే జరిగి ఉంటే.. ఆ వైవాహిక బంధంలో కొనసాగకుండా ఉత్తర్వులు ఇవ్వవచ్చు. ఆమె అభ్యర్థనను స్వీకరించిన కోర్టు మంగళవారం ప్రాథమిక వాదనలను విన్నది. హయా వద్ద ఉన్న తన పిల్లలను తిరిగి దుబాయ్‌కు పంపించాలని దుబాయ్ రాజు కూడా పిటిషన్ వేసిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
2117 నాటికి మార్స్‌పై సిటీ
దుబాయ్: మానవుడు తన మేధాశక్తికి సాంకేతికతను జోడించి అసాధ్యమ నుకున్న వాటిని సుసాధ్యం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఇతర గ్రహాలపై పరిశోధనలకు మాత్రమే పరిమితమైన దీన్ని త్వరలోనే గ్రహాలపై గృహాలు, నగరాలు, ఆధునిక కట్టడాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే నిజమైతే రానున్న కాలంలో మనిషిని కూడా గ్రహాంతరవాసిగా పరిగణించే పరిస్థితి రానుంది. మరో వందేళ్లలో.. అంటే 2117 నాటికి అంగారకుడిపై మొట్టమొదటి నగరాన్ని నిర్మించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రణాళికలు రచిస్తోంది. దీంతోపాటు రానున్న దశాబ్దకాలంలో మనుషులను రవాణా చేసేందుకూ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు రానున్న 100 ఏళ్ల జాతీయ ప్రణాళిక విధానాన్ని యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్, అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రకటించినట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది. రానున్న వందేళ్ల కాలంలో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అంతరిక్ష పరిశో ధనలు ప్రారంభించి యువతను ఆకర్షించను న్నట్లు తెలిపారు. అలాగే మనుషులు, ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపేందుకు భూమి, అరుణగ్రహం మధ్య వేగవంతమైన రవాణా మార్గాన్ని నిర్మించను న్నట్లు చెప్పారు. ‘ఇతర గ్రహాలపై అడుగుపెట్టడం మానవుని దీర్ఘకాల కోరిక. ఈ కలను యూఏఈ నిజం చేస్తుంది’ అని దుబాయ్ రాజు రషీద్ అన్నారు. మార్స్ పై పరిశోధనలకు తమ మొదటి అంతరిక్షనౌకను 2021 లో ప్రయోగించనున్నట్లు యూఏఈ ప్రకటించింది.