
వీధిలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్.. ఒకరు మృతి
హైదరాబాద్: సరదాకు అడుకున్న ఆట ఒకరి ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో చోటు చేసుకుంది. అత్యంత భయంకరమైన క్రీడగా చెప్పుకునే డబ్ల్యూ డబ్ల్యూ బాక్సింగ్ తరహాలో నబీల్ మరికొందరు వ్యక్తులు కలిసి పాతబస్తీలోని ఓ వీధికి చేరారు.
అనంతరం వారంతా కలిసి వీధి బాక్సింగ్కు దిగారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రింగుగా భావించి ఘోరంగా తలపడ్డారు. దీంతో పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతో నబీల్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలుకోల్పోయాడు. కాగా, ఇది అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. మరోపక్క, వారు బాక్సింగ్ తలపడిన వీడియో ఒకటి బయటకు వచ్చి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.