నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం | post-matam-for-nabil-dead-body | Sakshi
Sakshi News home page

Published Mon, May 11 2015 1:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధంలో మరణించిన నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తన కొడుకును ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారనే ఆరోపణలపై పోలీస్ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నా.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. దీనిలో భాగంగా నబీల్ మృతదేహాన్ని వెలికితీయనున్నారు. ఉస్మానియా నుంచి శ్మశానానికి చేరిన డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ నివేదిక వచ్చిన అనంతరం తమ దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement