హైదరాబాద్: పాత బస్తీ స్ట్రీట్ ఫైట్ ఘటనలో మొత్తం ఎనిమిదిమందిని సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నబీల్ను హత్య చేశారినవారందరిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్‌తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్ చేసిన ఘటనలో నబీల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒవేస్... నబీల్‌పై ముష్టిఘాతాలు కురిపించడంతో తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్‌లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఎనిమిదిమంది అరెస్టు
Published Mon, May 11 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement