Kiss Street In Mexico Where Couple Go For Kiss, Here's All You Need To Know About This Alley - Sakshi
Sakshi News home page

Kiss Street In Mexico: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్‌ పెట్టాల్సిందే!

Jun 26 2023 11:58 AM | Updated on Jun 26 2023 1:00 PM

kiss street in mexico where couple go for kiss - Sakshi

ప్రపంచంలో వింత ఆచారాలకు కొదవేలేదు. ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ ఏదో ఒక ఆచారానికి కట్టుబడి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదేవిధంగా కొన్ని విచిత్రమైన ఆచారాలు కొనసాగే ప్రాంతాలను కూడా అప్పుడప్పుడు చూసి ఉంటాం. లేదా విని ఉంటాం. 

అటువంటిదే.. ‘కిస్‌’తో ముడిపడి ఉన్న ఆచారాన్ని పాటించే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా కపుల్స్‌ ఆ ప్రాంతానికి వెళ్లి ముద్దుల వర్షం కురిపించుకోవాలనుకుంటారు. అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది? ముద్దులతో కూడిన నమ్మకాల వెనుక ఆధారమేమిటి? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వింత ప్రాంతం ఎలా ఉంటుందంటే..
ఈ ప్రాంతం ఒక బిల్డింగ్‌ లేదా ఏదో ధార్మిక స్థలమో కాదు. అది ఒక గల్లీ. దానిని కిస్‌ స్ట్రీట్ అని అంటారు. అది ఎంత ఇరుకైనదంటే ఒక జంట మాత్రమే దానిలోకి వెళ్లే వీలుంటుంది. ఒక్కొక్క జంటమాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నందున ఇక్కడ వేల జంటల క్యూ కనిపిస్తుంది. వీరంతా ఒక జంట తరువాత మరొక జంట ఈ గల్లీలోకి వెళుతుంటారు. అక్కడ కిస్‌ చేసుకుని తిరగివస్తారు.

ఈ గల్లీ ఎక్కడుందంటే..
ఈ గల్లీ మెక్సికోలోని గువానాజువాటోలో ఉంది. దీనిని ‘ఎలో ఆఫ్‌ ది కిస్‌’ అని అంటారు. ఇంటర్నెట్‌లో ఈ గల్లీకి సంబంధించిన వివరాలు, ఫొటోలు విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అత్యంత ఇరుకైన గల్లీ మాదిరిగా ఇది ఉంటుంది. 

ఇక్కడి కిస్‌ వెనుక నమ్మకమిదే..
ఈ గల్లీకి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక జంట పరస్పరం ఎంతో ప్రేమ కలిగివుండేది. ఈ జంటలోని యువతి ధనవంతురాలు. యువకుడు పేద ఇంటికి చెందినవాడు. వారు రహస్యంగా ఇక్కడికి వచ్చి, కిస్‌ చేసుకునేవారు. అయితే ఆ యువతి ఇంటిలోని వారు వీరి ప్రేమను వ్యతిరేకించారు. అయినా ఆ యువతి ఈ స్ట్రీట్‌కు వచ్చి అతనిని కలుసుకునేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారు. ఫలితంగా వారి ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. అయితే వారి ప్రేమ గాథను కలకాలం జీవింపజేసేందుకు వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటాయి. ఈ గల్లీలో కిస్‌ చేసుకుంటే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. 

ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్‌ వెనుక సింపుల్‌ లాజిక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement