
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌దే గెలుపు
ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం
నార్కట్‌పల్లిలో డిపోలో 100 శాతం పోలింగ్
ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై 176 ఓట్ల మెజార్టీ
నార్కట్‌పల్లిః
ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి విడుదలైన ఫలితాల్లో ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై టీఎంయూ విషయం సాధించింది. నార్కట్‌పల్లి డిపోలో 284 ఓట్లు ఉండగా అందులో 8 బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి, 276 ఓట్లకు 276 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డూబ్ల్యూఎఫ్ కూటమిగా, తెలంగాణ మజ్దూర్, ఎన్‌ఎంయూలు ఒంటరిగా బరిలోకి దిగాయి. నార్కట్‌పల్లి డిపోలో క్లాస్ 3 తెలంగాణ మజ్జూర్ యూనియన్‌కు 222 ఓట్లు రాగ, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి 46 , ఎన్‌ఎంయూకు 6 , చక్రం గుర్తుకు ఒక ఓటు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. క్లాస్ 6లో టీఎమ్‌యూకు 212, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియాలకు 55,ఎన్‌ఎంయూకి 6 , చక్రం1 ఓటు రాగ రెండు ఓట్లు చెల్లలేదు. దీంతో 176 ఓట్లతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వీరికి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.