మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన మనిక! | Manika Batra Wins World Table Tennis (WTT) Feeder Level Tournament | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన మనిక!

Published Thu, May 16 2024 12:50 PM | Last Updated on Thu, May 16 2024 12:55 PM

Manika Batra Wins World Table Tennis (WTT) Feeder Level Tournament

కపాడోసియా (టర్కీ): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ లెవెల్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా మూడో రౌండ్‌లోకి చేరింది. ప్రపంచ 24వ ర్యాంకర్‌ మనిక బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో 11–9, 6–11, 11–8, 9–11, 11–5తో వాంగ్‌ జిజు (చైనీస్‌ తైపీ)పై గెలిచింది.

భారత్‌కే చెందిన కృత్విక, యశస్విని, స్వస్తిక కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కృత్విక 11–9, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్‌ (ఫ్రాన్స్‌)పై, యశస్విని 11–9, 11–7, 8– 11, 11–4తో సిమే కులాక్‌సెకెన్‌ (టర్కీ)పై, స్వస్తిక 11–5, 11–5, 11–9తో గరీమా గోయల్‌ (భారత్‌) పై విజయం సాధించారు.

ఇవి చదవం‍డి: Sunil Chhetri: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement