World Table Tennis Championship
-
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన మనిక!
కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా మూడో రౌండ్లోకి చేరింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక బుధవారం జరిగిన రెండో రౌండ్లో 11–9, 6–11, 11–8, 9–11, 11–5తో వాంగ్ జిజు (చైనీస్ తైపీ)పై గెలిచింది.భారత్‌కే చెందిన కృత్విక, యశస్విని, స్వస్తిక కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కృత్విక 11–9, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై, యశస్విని 11–9, 11–7, 8– 11, 11–4తో సిమే కులాక్సెకెన్ (టర్కీ)పై, స్వస్తిక 11–5, 11–5, 11–9తో గరీమా గోయల్ (భారత్) పై విజయం సాధించారు.ఇవి చదవండి: Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన -
సుతీర్థ–ఐహిక జోడీకి టైటిల్
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిíÙయాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
World TT Championship: శ్రీజ, శరత్ కమల్ పరాజయం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ శ్రీజ ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 112వ ర్యాంకర్ శ్రీజ 2–11, 4–11, 2–11, 4–11తో ప్రపంచ పదో ర్యాంకర్ యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–దియా చితాలె (భారత్) జోడీ 8–11, 8–11, 11–13తో సన్ యింగ్షా–వాంగ్ మాన్యు (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత వెటరన్ స్టార్, 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లో 4–11, 11–13, 8–11, 10–12తో లీ సాంగ్ సు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ (భారత్) జోడీ.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. -
World TT Championship: మనిక శుభారంభం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో మనిక 11–1, 11–3, 11–2, 11–5తో లిండా లోగ్రైబి (అల్జీరియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో శరత్ కమల్ 11–8, 9–11, 11–9, 11–6, 11–6తో డేవిడ్ సెర్డారోగ్లు (ఆస్ట్రియా)పై నెగ్గగా... సత్యన్ 11–9, 11–8, 7–11, 11–2, 13–15, 11–13, 11–6తో టామ్ జార్విస్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో శరత్ కమల్–సత్యన్ ద్వయం 11–6, 11–9, 11–6తో ఎల్బెలీ–షౌమన్ (ఈజిప్ట్) జోడీపై విజయం సాధించింది. -
WTT Singapore Smash Tourney 2023: ఆకుల శ్రీజకు నిరాశ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్‌కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్హుయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్ డిక్సన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
World table tennis: సింగిల్స్ విజేత హన్సిని
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకున్నారు. ఈక్వెడార్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్ రాజన్ అండర్–13 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్ (ఈక్వెడార్)పై గెలిచింది. అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో యశస్విని, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్ సాధించారు. -
ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్ విజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్ తొలి రౌండ్లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్జిక్ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్–10 ర్యాంకింగ్స్ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్ కెరీర్లో ఇది రెండోసారి. -
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ
సంజీత్ ముందంజ బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), ఆకాశ్ (54 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సంజీత్ 4–1తో ఆండ్రీ స్టోట్‌స్కీ (రష్యా)పై గెలిచాడు. ఆకాశ్‌తో తలపడాల్సిన జర్మనీ బాక్సర్ ఒమర్ సలాహ్ అస్వస్థత కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఆకాశ్‌కు ‘వాకోవర్’ లభించింది. జ్వరం కారణంగా భారత బాక్సర్ వరీందర్ (60 కేజీలు) టోర్నీ నుంచి వైదొలిగాడు. ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ ట్యూనిస్ ఓపెన్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ (భారత్) జంట టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–హర్మీత్ ద్వయం 8–11, 12–14, 11–9, 11–8, 11–9తో నాందోర్ ఎసెకి–ఆడమ్ జుడి (హంగేరి) జంటపై గెలిచింది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
శరత్ కమల్ ఓటమి
డసెల్డార్ఫ్ (జర్మనీ): ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో శరత్ 13–11, 9–11, 7–11, 11–8, 8–11, 4–11తో ప్రపంచ 40వ ర్యాంకర్ లిన్ గావోయున్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. శరత్ ఓటమితో ఈ టోర్నీలో సింగిల్స్‌లో భారత కథ ముగిసింది.