
సంజీత్ ముందంజ
బెల్‌గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), ఆకాశ్ (54 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సంజీత్ 4–1తో ఆండ్రీ స్టోట్‌స్కీ (రష్యా)పై గెలిచాడు. ఆకాశ్‌తో తలపడాల్సిన జర్మనీ బాక్సర్ ఒమర్ సలాహ్ అస్వస్థత కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఆకాశ్‌కు ‘వాకోవర్’ లభించింది. జ్వరం కారణంగా భారత బాక్సర్ వరీందర్ (60 కేజీలు) టోర్నీ నుంచి వైదొలిగాడు.
ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ
ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ ట్యూనిస్ ఓపెన్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ (భారత్) జంట టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–హర్మీత్ ద్వయం 8–11, 12–14, 11–9, 11–8, 11–9తో నాందోర్ ఎసెకి–ఆడమ్ జుడి (హంగేరి) జంటపై గెలిచింది.
చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment