ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది.
మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిíÙయాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment