
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకున్నారు. ఈక్వెడార్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్ రాజన్ అండర్–13 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్ (ఈక్వెడార్)పై గెలిచింది. అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో యశస్విని, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment