![Akula Sreeja is the champion of table tennis - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/25/srija.jpg.webp?itok=z6OEpTY8)
లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ చాంపియన్‌గా అవతరించింది. బీరుట్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ 6–11, 12–10, 11–5, 11–9తో సారా డి నుట్టె (లక్సెంబర్గ్)పై గెలిచింది.
విజేతగా నిలిచిన శ్రీజకు 550 డాలర్ల (రూ. 46 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment