వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినోయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
2016లో తొలిసారి ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిస్‌లో పలు పదవులు నిర్వహించారు. కాగా, ఇల్లినోయిస్‌లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగింది. మొదటినుంచి కమలకు బలమైన అండగా రాష్ట్రం నిలబడింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: కమలాహారిస్ గ్రామంలో ఉత్సవ వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment