Raja Krishnamoorthi
-
ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినోయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిస్‌లో పలు పదవులు నిర్వహించారు. కాగా, ఇల్లినోయిస్‌లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగింది. మొదటినుంచి కమలకు బలమైన అండగా రాష్ట్రం నిలబడింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: కమలాహారిస్ గ్రామంలో ఉత్సవ వాతావరణం -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
భారత సంతతి విజేతలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్. ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు. రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు. సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే. -
యూఎస్ ఎన్నికల్లో హిందూ ఓట్లు కీలకం!
వాషింగ్టన్: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న సుమారు 20 లక్షల హిందువుల ఓట్లు ఎన్నికల్లో కీలకమని ఇండో అమెరికన్ రాజకీయనేత రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్లో హిందువుల ఓట్‌బ్యాంక్ చాలా ముఖ్యమైనదన్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన కృష్ణమూర్తి ఆన్లైన్లో హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్ పేరిట ప్రచారం ఆరంభించారు. జోబైడెన్, కమలాహారిస్ ద్వయానికి ఓటేయాలని ఈ సందర్భంగా ఆయన ఇండో అమెరికన్లను కోరారు. వసుధైక కుటుంబకమ్ అనే భావనను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌కు మద్దతు పలకాలని కోరారు. ఇండో అమెరికన్ల ప్రయోజనాల కోసం అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్.. ఇలా అనేక రాష్ట్రాల్లో హిందూ ఓట్‌బ్యాంక్ చాలా కీలకమని, ప్రతిఒక్కరూ ఓట్ వేయడం ద్వారా స్వీయధర్మాన్ని పాటించాలని ఆయన చెప్పారు. మూడున్నరేళ్లుగా దేశంలో విద్వేష ప్రసంగాలు, వివక్ష పెరిగిపోయాయని ప్రచారంలో పాల్గొన్న న్యూజెర్సీ కో స్టేట్ డైరెక్టర్ నికి షా అభిప్రాయపడ్డారు. ట్రంప్ పాలనలో హిందువులపై విద్వేషం మూడు రెట్లు పెరిగిందని విమర్శించారు. కెంటకీలో స్వామినారాయణ్ గుడి వద్ద జరిగిన విధ్వంసాన్ని టెంపుల్ ప్రతినిధి రాజేశ్ పటేల్ వివరించారు. బైడెన్ మాట నిలబెట్టుకునే మనిషని, సమానత్వాన్ని విశ్వసిస్తాడని కృష్ణమూర్తి చెప్పారు. అందువల్ల ఆయనకు మద్దతు పలకాలని కోరారు. ప్రధానపార్టీల పోటాపోటీ హిందూ అమెరికన్ల మద్దతు కోరుతూ రెండు ప్రధాన పార్టీలు విపరీతంగా కృషి చేయడం ఇదే తొలిసారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ట్రంప్ ‘‘హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్’’ పేరిట, ఇటు బైడెన్ ‘‘హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’’ పేరిట హిందూ ఓట్బ్యాంకును ఆకట్టుకునే యత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారు తామే హిందువుల హక్కుల పరిరక్షకులమని, వారి ఉన్నతికి తోడ్పడతామని చెప్పుకుంటున్నారు. 2016లో హిందూ ఓట్‌బ్యాంక్ బలాన్ని గమనించిన ట్రంప్ వీరిని ఆకట్టుకునేందుకు పలు యత్నాలు చేశారు. ఆయన, ఆయన కుటుంబసభ్యులు పలు దేవాలయాలను సందర్శించారు. ఈ దఫా మరోమారు వీరి మద్దతు కోసం ట్రంప్ యత్నిస్తుండగా, వీరిని తనవైపునకు మలచుకునేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారు. చదవండి: పోస్టల్ ఓట్లకు భారీ డిమాండ్ -
భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు నియమితులయ్యారు. సిలికాన్ వ్యాలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.. హౌస్ బడ్జెట్ కమిటీకి, సియాటెల్ నుంచి ఎన్నికైన ప్రమీలా జయపాల్ హౌస్ జుడీషియరీ కమిటీకి నామినేట్ అయ్యారు. షికాగో ఉత్తర, వాయవ్య ప్రాంతం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హౌస్ ఎడ్యుకేషన్, వర్క్‌ఫోర్స్ కమిటీకి నామినేట్ అయ్యారు. దీంతోపాటే హౌస్ డెమొక్రటిక్ పాలసీ, స్టీరింగ్ కమిటీ బాధ్యతలను కృష్ణమూర్తి చూసుకోన్నారు. అమిత్ బేరా విదేశీవ్యవహారాల కమిటీ, సైన్స్, స్పేస్, టెక్నాలజీ కమిటీకి తిరిగి నామినేట్ అయ్యారు. అమెరికా సెనేట్‌కు తొలిసారి ఎన్నికైన కమలా హారిస్..బడ్జెట్ కమిటీ, నిఘా సెలక్ట్ కమిటీ, పర్యావరణ, ప్రజాపనుల కమిటీ, భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీ ఇలా నాలుగు కమిటీలకు నామినేట్ అయ్యారు. ఇంతమంది భారతీయ అమెరికన్లు కీలక కమిటీలకు ఎన్నికవడం అమెరికాకాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారి. -
కమల, కృష్ణమూర్తి విజయకేతనం
కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ మహిళ, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. తొలి ఇండియన్-అమెరికన్ సెనేటర్‌గా ఎన్నికైన ఘనత దక్కించుకున్నారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి లోరెట్టా శాన్‌చెజ్ పై విజయం సాధించారు. 51 ఏళ్ల కమల... అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతుతో బరిలోకి దిగారు. కమల తల్లి 1960లో చెన్నై నుంచి అమెరికాకు వలసవచ్చారు. భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్(51) కూడా రికార్డు సృష్టించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికా మహిళగా ఘనత సాధించారు. వాషింగ్టన్ నుంచి డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ 57 శాతం ఓట్లు సాధించారు. ఆమె ప్రత్యర్థికి బ్రాడీ వాకిన్షాకు 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి గెలుపు సాధించారు. ఇలినాయి నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. కృష్ణమూర్తికి ప్రవాస తెలుగు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రతినిధుల సభకు పోటీ పడిన మరో ఇండియన్ అమెరికన్ పీటర్ జాకబ్ పరాజయం పాలయ్యారు. న్యూజెర్సీ నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. రిపబ్లికన్ అభ్యర్థి లియోనార్డ్ లాన్స్ చేతిలో 15 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
రాజా కృష్ణమూర్తికి ఇండో అమెరికన్ల మద్ధతు
భారత సంతతికి చెందిన అమెరికన్లు డల్లాస్‌లోని డాక్టర్ ప్రసాద్ తోటకూర నివాసంలో సమావేశమయ్యారు. ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి నవంబర్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలిస్తే ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నిధులు సమకూర్చుకునేందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూర తన నివాసంలో కొందరు కీలక నేతలతో సమావేశమయ్యారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా మారడానికి రాజా కృష్ణమూర్తికి వేదిక సిద్ధంగా ఉందని ఈవెంట్ నిర్వాహకులు ప్రసాద్ తోటకూర అన్నారు. సామాన్య ప్రజల కష్టాలు ఆయనకు తెలుసునని, అమెరికా చరిత్రలోనే ఆయన అత్యుత్తమ రిప్రజెంటేటివ్ కానున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డెమొక్రాటిక్ జాతీయ సదస్సులో ప్రైమరీ ఎన్నికల్లో గెలవడంతో పార్టీలో ఉన్నత వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. దలీప్ సింగ్, బాబీ జిందాల్, అమి బెరా తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన నాల్గవ వ్యక్తి కానున్నారని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన ఎంవిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ... రాజా కృష్ణమూర్తి స్వస్థలం న్యూఢిల్లీ ఆయన చిన్నతనంలోనే కుటుంబంతో పాటు న్యూయార్క్ వచ్చారని తెలిపారు. ఇండో అమెరికన్ సభ్యులకు ఆయన ఓ రోల్ మోడల్ అని, ఆయన విద్యారంగం కోసం విశేషకృషి చేశారని కొనియాడారు. 2004లో అమెరికా సెనేట్ ఎన్నికల కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ విభాగంలో డైరెక్టర్‌గా సేవలు అందించారని పేర్కొన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రుల త్యాగాలే కారణమని, వారికి తాను రుణపడి ఉంటానని రాజా కృష్ణమూర్తి అన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువలు, సాంప్రదాయంపై ఉన్న గౌరవం తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని, అయితే ఇండో అమెరికన్లు ఈ రంగంలోకి రావడం లేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న ఇండో అమెరికన్లు విద్యారంగం, మెడిసిన్ , వ్యాపారం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఇతర రంగాలలో రాణిస్తున్నారని, రాజకీయాల్లో కూడా మనం రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసాద్ తోటకూర, పాల్ పాండియన్, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్ సహా తనకు మద్ధతు తెలిపేందుకు వచ్చిన అందరకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నేతల కంటే అధికంగా నిధులు సమకూర్చుకోవడంతోనే రాజా కృష్ణమూర్తి దాదాపు విజయం సాధించినట్లే అని సీసీ థియోఫిన్ అన్నారు. చికాగో మిత్రులంతా త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటును రాజాకు వేయాలని పిలుపునిచ్చారు. సాయి సతీష్, ప్రశాంతి, ఇతర ముఖ్య సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్ తోటకూర, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్, పాల్ పాండియన్, సాయి సతీష్, డార్టర్ ప్రశాంతి గణేశా, స్వరూప తోటకూర, క్రిత్తిక గణేశా, మురళీ వెన్నం, అమృత్ కృపలాణి, మహేష్.జి, ఆర్ చేబ్రోలు, ఫాతిమా, తాయిబ్ కుంద్రావాలా, తన్వీర్, బెనజీర్ అర్ఫీ, అబిద్ అబేది, విజయ అండ్ లక్ష్మణ్ ఉప్పల, డాక్టర్ ఎస్ గుప్తా, మహేశ్ శెట్టి, డాక్టర్ సీఆర్ రావు శ్రీకాంత్.పి, పరిమళ, దినేష్, సింధు, చెన్నకేశవులు మొక్కపాటి, షిజు అబ్రహం, రాఘవేంద్ర కులకర్ణి, అరవింద్ ముప్పిడి, మోహన్ చంద్రన్, మురుగనాథన్.పి, శ్రీనివాస్ కాసు, డాక్టర్ యోగి చిమాటా, డాక్టర్ ధ్రువ్ బాలకొండి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'ఎమర్జింగ్ లీడర్’గా భారత సంతతి వ్యక్తి
ఫిలడెల్ఫియా: అమెరికాలో భారత సంతతి వ్యక్తులు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. శాస్త్రసాంకేతిక, విద్యా రంగాల్లోనే కాకుండా రాజకీయంగాను అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లినాయిస్కు చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తిని.. ‘పార్టీ ఎమర్జింగ్ లీడర్’గా ప్రకటించింది. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రైజింగ్ స్టార్ లేదా ఎమర్జింగ్ లీడర్లుగా ఇద్దరి పేర్లను ప్రకటించగా అందులో భారత సంతతికి చెందిన కృష్ణమూర్తి ఒకరు కావడం విశేషం. మార్చి 16న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతోనే పార్టీ ఆయనకు తగిన గుర్తింపునిచ్చిందని డెమోక్రటిక్ మద్దతుదారులు చెబుతున్నారు.