
'ఎమర్జింగ్ లీడర్’గా భారత సంతతి వ్యక్తి
ఫిలడెల్ఫియా: అమెరికాలో భారత సంతతి వ్యక్తులు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. శాస్త్రసాంకేతిక, విద్యా రంగాల్లోనే కాకుండా రాజకీయంగాను అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లినాయిస్‌కు చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తిని.. ‘పార్టీ ఎమర్జింగ్ లీడర్’గా ప్రకటించింది.
డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రైజింగ్ స్టార్ లేదా ఎమర్జింగ్ లీడర్లుగా ఇద్దరి పేర్లను ప్రకటించగా అందులో భారత సంతతికి చెందిన కృష్ణమూర్తి ఒకరు కావడం విశేషం. మార్చి 16న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతోనే పార్టీ ఆయనకు తగిన గుర్తింపునిచ్చిందని డెమోక్రటిక్ మద్దతుదారులు చెబుతున్నారు.