విజయవాడ: చేనేత కళాకారుల పనితనం గురించి వినడమే కానీ... ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ కలగదు. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బ్రాండ్ తనైరా.. చేనేత వస్త్రాల విక్రయ షోరూమ్స్‌లో లైవ్ లూమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిని ఇటీవలే విజయవాడలో ప్రారంభించి త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా తనైరా ప్రతినిధులు పంచుకున్న వివరాల ప్రకారం...
వైభవానికి ప్రతీక..
సంప్రదాయ దుస్తులలో తనదైన ప్రత్యేకత కలిగిన టాటా తనైరా. భారతీయ చేనేత వైభవాన్ని దశదిశలా విస్తరించాలని యోచిస్తోంది. మారుతున్న అభిరుచులు పెరిగిన సాంకేతికతో పోటీ పడలేక అంతరించే దశకు చేరిన ఎన్నో చేనేత కళారూపాలకు పునర్జీవనం పోసేందుకు కృషి చేస్తోంది. అలనాటి చేనేత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయటంతో పాటుగా ప్రాంతీయ అరుదైన పనితనంతో అద్భుతాలు అందదించడంలోని శ్రమను, సంక్లిష్టతను తెలియజెప్పేలా.. సంప్రదాయ నేత పద్ధతులతో కస్టమర్లను మళ్లీ అనుసంధానించడానికి తనైరా స్టోర్‌లలో ఈ లైవ్ లూమ్‌లని ఏర్పాటు చేసింది. ఇక్కడ, నైపుణ్యం కలిగిన నేత కార్మికులు తమ పనితనం, కళాత్మకతను కస్టమర్స్‌కి ప్రదర్శిస్తారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, ఇకత్‌లతో సహా గద్వాల్, నారాయణపేట, బనారస్, చందేరి, మహేశ్వర్ తదితర ప్రత్యేకమైన క్రాఫ్ట్‌ల కళాత్మక వైభవాన్ని మరింత అందంగా ప్రదర్శిస్తుంది.
ఎనిమిదేళ్లుగా..
తమ కార్యకలాపాలను 2017లో ప్రారంభించిన తనైరా, దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షిస్తూ రూ. 50,000 కోట్ల ఎత్నిక్ వేర్ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకుంది. స్థానిక కళాకారుల సహకారంతో సంప్రదాయ నేత పద్ధతులను పునరుద్ధరించడానికి ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది, తద్వారా చేనేతల వారసత్వాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. అరుదైన అంతగా తెలియని బాలుచారి, రంగకత్, వైరౌసి, పటాన్ పటోలా డోలీ బరాత్ వంటి విభిన్న శ్రేణి భారతీయ చేనేతలు సైతం తనైరా ఎంపికలో ఉన్నాయి.
విపణిలో నిలిపేలా.. వీవర్‌శాల
సాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడంతో పాటు ఆధునీకరించే లక్ష్యంతో తనైరా గత 2022లో ’వీవర్‌శాల’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి, చంపా, కోయంబత్తూర్, బారుయ్‌పూర్, ఫులియా, మంగళగిరి లాంటి ప్రాంతాల్లో దాదాపు వంద మంది కళాకారులతో 20 వీవర్‌శాలలల ఏర్పాటు ద్వారా బహుళ తరాలకు చెందిన కళాకారులతో కలిసి పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment