కష్టాన్నే నమ్ముకోవాలి | Anchor Suma Kanakala Special Message On Womens Day 2025 | Sakshi
Sakshi News home page

కష్టాన్నే నమ్ముకోవాలి

Mar 8 2025 4:52 AM | Updated on Mar 8 2025 4:52 AM

Anchor Suma Kanakala Special Message On Womens Day 2025

సుమ, యాంకర్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్‌ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్‌కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్‌ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్‌గా మారిపోయింది..ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..

‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ  రైల్వేక్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్‌ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్‌ లాంగ్వేజ్‌గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్‌ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్‌ హెల్ప్‌ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!

దూరదర్శన్‌ మాత్రమే.. 
ఈ ఫీల్డ్‌లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్‌ప్రోగ్రామ్‌ నచ్చి, దూరదర్శన్‌ సీరియల్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు గారు ఫోన్‌ చేశారు.. ‘ప్రదీప్‌ గారి డైరెక్షన్‌లోని ఓ సీరియల్‌లో మమ్మల్ని కాస్ట్‌ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్‌ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్‌ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్‌ చానల్‌ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్‌ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్‌ ఎపిసోడ్స్‌లోనే ఎక్కువగా చేశాను. 

కొన్ని సినిమా బేస్డ్‌ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్‌ కూడా చేశాను. శాటిలైట్‌ చానల్స్‌ స్టార్ట్‌ అవగానే పూర్తిగా యాంకరింగ్‌కి షిఫ్ట్‌ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్‌ మోర్‌’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్‌ మహిళ’ లాంటి ఎన్నో షోస్‌ని హోస్ట్‌ చేశాను. ‘స్టార్‌ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్‌ చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్‌స్పైర్‌ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు.  అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్‌.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్‌కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం.    

ఇప్పుడు.. 
నా యూట్యూబ్‌ చానల్‌లో ‘చాట్‌ షో’ని స్టార్ట్‌ చేశాను. అలాగే ‘షెఫ్‌ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్‌ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్‌ టెంపుల్స్‌’ అనే సిరీస్‌ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్‌కి ఆకాశమే హద్దు. ఒక రీల్‌ షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే చాలు.. వైరల్‌ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్‌తో ఎంటర్‌టైన్‌ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్షన్‌ను అందిస్తున్నాను. లీజర్‌టైమ్‌ దొరికితే.. వెబ్‌ సిరీస్, మూవీస్‌ చూస్తాను.

నాకు అత్యంత మెమరబుల్‌ మూమెంట్‌ నా పిల్లలే! ప్రొఫెషన్‌కి సంబంధించి అయితే .. నంది అవార్డ్‌ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్‌ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌’ అనే ఎన్‌జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్‌ చేశాను. భవిష్యత్‌లో మరికొన్నిప్రాజెక్ట్స్‌ చేపట్టాలని ప్లాన్‌ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. 

బహుభాషలతో ప్రయోజనం
యాంకరింగ్‌ పర్సనల్‌ క్యారెక్టర్‌కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్‌ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్‌ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్‌ పాయింట్‌ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం,  ఇంగ్లిష్‌ లో ఫ్లుయెన్సీ వల్ల..  ఏవైనా అవార్డ్‌ ఫంక్షన్స్‌కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్‌ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్‌లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్‌ షోసే కాబట్టి ఎడిటింగ్‌కి స్కోప్‌ ఉండదు. నాకు నేనే ఎడిటర్‌గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్‌కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్‌కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్‌ బ్యాలెన్స్‌ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్‌కు బిగ్గెస్ట్‌ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. 

 – శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement