వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే! | It's like getting married - K. Raghavendra Rao | Sakshi
Sakshi News home page

వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!

Published Wed, Sep 20 2017 12:34 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!

వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!

‘‘రాజీవ్, సుమ నేను తీసిన ఓ యాడ్‌లో నటించారు. ఇద్దర్నీ వేర్వేరుగా రమ్మంటే... నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇదీ (జుజుబీ టీవీ, ఇండిపెండెంట్‌ ఫిల్మ్స్‌ నిర్మించడం) నాకు చెప్పకుండా స్టార్ట్‌ చేశారు. సో, హిట్టే. ‘సుమ రాజీవ్‌ క్రియేషన్స్‌’ సక్సెస్‌  కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ప్రవీణ్‌ యండమూరి, శ్రీముఖి మేకల జంటగా సందీప్‌ మెండి దర్శకత్వంలో ప్రపూర్ణ ప్రొడక్షన్‌ హౌస్‌ తో కలసి సుమరాజీవ్‌ క్రియేషన్స్‌ నిర్మించిన ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ‘అలనాటి రామచంద్రుడు’.

త్వరలో ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్‌ ఛానల్‌)లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు, పాటల సీడీలను వరా ముళ్లపూడి, ‘జుజుబీ టీవీ’ ప్రోమోను కొరటాల శివ విడుదల చేశారు. ‘‘మా ఆత్మను తృప్తిపరిచే చిత్రాలు తీస్తూ, యువతను ప్రోత్సహించడానికి ‘జుజుబీ టీవీ’ స్టార్ట్‌ చేశాం’’ అన్నారు రాజీవ్‌ కనకాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement