యాంకర్‌ సుమ సాయం.. ఎమోషనల్‌ అయిన 'బిగ్‌ బాస్‌' సోహైల్‌ | Anchor Suma Helps To Syed Sohel | Sakshi
Sakshi News home page

యాంకర్‌ సుమ సాయం.. ఎమోషనల్‌ అయిన 'బిగ్‌ బాస్‌' సోహైల్‌

Published Mon, Jan 29 2024 12:05 PM | Last Updated on Mon, Jan 29 2024 12:40 PM

Anchor Suma Helps To Syed Sohel - Sakshi

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్‌ కట్‌ బాలరాజు'. గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై నిర్మాతగా ఈ చిత్రాన్ని సోహైల్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్‌, సిరి హన్మంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఇందులోని పాటలకు కూడా మంచి గుర్తింపు దక్కింది. 

'బూట్‌ కట్‌ బాలరాజు' చిత్రానికి నిర్మాతగా మారిన సయ్యద్‌ సోహైల్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ కార్యక్రమాలు ప్రారంభించాడు. సినిమాను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే పలు ఈవెంట్స్‌తో ప్రమోట్‌ చేసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు రీచ్‌ అవుతుంది. ఇలాంటి వేడుకలకు భారీగానే ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే యాంకర్‌కు కూడా అధిక మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై రీసెంట్‌గా సోహైల్‌ పలు వ్యాఖ్యలు చేశాడు. 

'బూట్‌ కట్‌ బాలరాజు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్నడంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశామని అందులో యాంకర్‌గా సుమ ఉంటే బాగుంటుందని అనుకున్నట్లు సోహైల్‌ ఇలా చెప్పాడు.. 'సుమ అక్కతో మాట్లాడాలని మేనేజర్‌కు కాల్‌ చేశాను. ఆయనతో మాట్లాడుతూ ఈవెంట్‌ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని కొంచెం తగ్గించాలని కోరాను. దీంతో సుమ గారితో మాట్లాడి చెబుతానని ఆయన తెలిపాడు.

కానీ కొంత సమయం తర్వాత సుమ అక్క నుంచి  కాల్‌ వచ్చింది. అక్కా.. ఈ కార్యక్రమం కోసం నేను తక్కువ డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌, అంత డబ్బు నా వద్ద లేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. దీంతో వెంటనే నీ దగ్గర డబ్బు తీసుకోను.. ఉచితంగానే ఈవెంట్‌ చేస్తాను. లైఫ్‌లో ఇంత ఎదిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయలేకపోతే ఎందుకు.. తప్పకుండా  'బూట్‌ కట్‌ బాలరాజు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంటానని సుమ చెప్పినట్లు సోహైల్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement