టాలీవుడ్‌లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టింది కేరళ అయినా.. తెలుగబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాక్షంలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సుమ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు లేకుండా నా వృత్తిని కొనసాగించడం కష్టం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. లవ్ యూ రాజీవ్.' అంటూ లవ్ సింబల్ ఎమోజీలను పంచుకుంది. ఇది చూసిన ఆడియన్స్ సైతం రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్‌గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment