
Suma Jayamma Panchayathi Movie Release Date: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ, దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ నటించారు. రామ్‌చరణ్ రిలీజ్ చేసిన మా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
అలాగే దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆవిష్కరించిన టైటిల్ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: అనూష్ కుమార్, సమర్పణ: విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అమర్–అఖిల.