
సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి.
శివాజీనగర: విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలతో నగరంలో శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుమ ను పై అధికారులు సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ దయానంద్ ఉత్తర్వులిచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ పోలీస్‌స్టేషన్‌లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఎస్‌ఐ సవిత రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చికకారు.
ఇందులో సీఐ సుమ పాత్ర ఉందని వినిపించింది. సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి. ఉన్నతాధికారులు చెప్పి పంపిన కేసుల్లో కూడా ఆమె లంచం డిమాండ్ చేసి, ఇచ్చేవరకూ పనిచేసేది కాదని ఆరోపణలున్నాయి. ఇంతకుముందు డీసీపీ భీమాశంకర్ గుళేద్ హెచ్చరించినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు లంచం, అలసత్వం, దుష్ప్రవర్తన తదితర ఆరోపణల కింద ఆమైపె సస్పెన్షన్ వేటు వేశారు.