Deputy Commissioner of Police
-
‘మకుటం’ లేని మహిళామణులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలోని మహిళా ఐపీఎస్‌ల పరిస్థితి మకుటం లేని మహిళామణుల మాదిరిగా మారింది. ఇక్కడ పని చేస్తున్న ఉమెన్ ఐపీఎస్‌ల సంఖ్య దాదాపు 30 వరకు ఉంది. అయితే యూనిట్ ఆఫీసర్లుగా పిలిచే కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారు మాత్రం కేవలం ముగ్గురే. త్వరలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడైనా ఈ పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫోకల్లోనూ రెండు రకాలైన పోస్టులు.. పోలీసు శాఖలో సాధారణంగా రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. శాంతిభద్రతల విభాగం వంటి ప్రాధాన్యం గల వాటిని ఫోకల్ అని, సీఐడీ, ట్రాఫిక్ వంటి ప్రాధాన్యం లేని వాటిని నాన్–ఫోకల్ పోస్టులని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ఫోకల్ పోస్టుల్లోనూ రెండు రకాలైనవి ఉన్నాయి. ఏదైనా జిల్లా లేదా కమిషనరేట్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉన్న ఎస్పీ ఆపై స్థాయి హోదాలోని పోస్టులను యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎస్పీ హోదాలోనే ఉన్నప్పటికీ... కమిషనరేట్లలోని జోన్లకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా (డీసీపీ) పని చేసే వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో ఇవీ ఫోకలే అయినప్పటికీ అక్కడి పని చేసే వారిని యూనిట్ ఆఫీసర్‌గా పరిగణించరు. ‘33’ కాదు కదా ‘10’ కూడా లేదు... పోలీసు విభాగంలో వివిధ స్థాయిల్లో జరిగే రిక్రూట్మెంట్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే వీరికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే పోస్టింగ్స్లోనూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తమ్మీద ఉన్న 39 యూనిట్లలో పదికి పైగా మహిళా ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పని చేయాలి. అయితే వాస్తవానికి పది శాతం కూడా యూనిట్ ఆఫీసర్లుగా మహిళా ఐపీఎస్‌లు లేరు. నిర్మల్ జిల్లాకు జానకీ శర్మిల, కామారెడ్డి జిల్లాకు సీహెచ్ సింధు శర్మ ఎస్పీలుగా ఉండగా... సిద్ధిపేట కమిషనరేట్‌కు బి.అనురాధ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురూ మినహా మరే ఇతర యూనిట్‌కు మహిళా ఐపీఎస్ నేతృత్వంలో లేదు. కేవలం సీఐడీ, ఎస్ఐబీ వంటి విభాగాలు మాత్రమే ఉన్నాయి. ఈసారైనా ఈ సీన్ మారేనా..? ఈ ముగ్గురు మహిళా ఐపీఎస్ల్లోనూ కేవలం సింధు శర్మ మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్ కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో అడుగుపెట్టి, నిరీ్ణత కాలం పని చేసిన తర్వాత ఐపీఎస్ హోదా పొందిన వారే. సింధు శర్మ ప్రస్తుతం నిజామాబాద్ కమిషనరేట్‌కు సైతం ఇన్చార్జ్గా ఉన్నారు. రాజకీయపరంగా అత్యంత సున్నితమైన ఈ రెండు యూనిట్లను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారనే పేరు పొందారు. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో పెద్ద స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నేపథ్యంలో మహిళా ఐపీఎస్ అధికారులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ కోణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
మహిళా సీఐ సస్పెండ్
శివాజీనగర: విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలతో నగరంలో శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమ ను పై అధికారులు సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ దయానంద్ ఉత్తర్వులిచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ పోలీస్‌స్టేషన్‌లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఎస్ఐ సవిత రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చికకారు. ఇందులో సీఐ సుమ పాత్ర ఉందని వినిపించింది. సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి. ఉన్నతాధికారులు చెప్పి పంపిన కేసుల్లో కూడా ఆమె లంచం డిమాండ్ చేసి, ఇచ్చేవరకూ పనిచేసేది కాదని ఆరోపణలున్నాయి. ఇంతకుముందు డీసీపీ భీమాశంకర్ గుళేద్ హెచ్చరించినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు లంచం, అలసత్వం, దుష్ప్రవర్తన తదితర ఆరోపణల కింద ఆమైపె సస్పెన్షన్ వేటు వేశారు. -
ఐదేళ్ల నాటి హత్య కేసు.. ఇప్పటికి ఓ కొలిక్కి!
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. గంజాం జిల్లాలోని భంజనగర వద్ద ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రోహిత్ (27), రింకు అలియాస్ భూపేష్ (27), సచిన్ అలియాస్ గౌరవ్ (28), దీపాంశు అలియాస్ మోంటు (26)లు సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో నివాసితుగా పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ అనే వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి 2016, డిసెంబర్ 28న రాక్ గార్డెన్ నుంచి వస్తున్నాడు. ఆ సమయంలో ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తి రోహిత్ స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఉస్మాన్‌ను కత్తితో నరికి చంపారు. దీనికి సంబంధించి 2016, డిసెంబర్ 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో పటేల్ నగర్ పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఖాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ డియో అన్నారు. ఇలా వెలుగులోకి.. పోలీసులు ఈ కేసులో అనుమానితులు వివరాలను సేకరించడానికి హ్యూమన్ ఇంటలీజెన్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. జూలై 27న కరోల్ బాగ్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి అతడి స్నేహితులు కలిసి ఖాన్‌తో గొడవ పడినట్లు గుర్తించారు. రోహిత్‌ని అరెస్టు చేసి విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ తెలిపారు. -
ఓవైసీ పై రాజ్యద్రోహం కేసు నమోదు
హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశ ద్రోహం కేసు నమోదైంది. 11 వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసును నమోదు చేసినట్టు ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. హైదరాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సమర్థిస్తూ మాట్లాడిన ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని కరుణా సాగర్ అనే లాయర్ న్యాయస్థానంలో ప్రైవేట్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఓవైసీపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించింది. -
హెల్ప్ ప్లీజ్..!
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరంలో పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనకు ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక ెహ ల్ప్లైన్కు ఒక నెలలోనే సుమారు 23 వేల ఫిర్యాదులు అందడం గమనార్హం. వీటిని పోలీస్ దర్యాప్తు శాఖ పరిశీలిస్తోంది. ఢిల్లీ పోలీస్ శాఖ సుమారు ఒక నెల కిందట అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తూ రెండు నంబర్లను (1064, 9910641064) నగరవాసుల కోసం అందుబాటులో ఉంచింది. కాగా, ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ మధ్య ఈ రెండు నంబర్లకు సుమారు 23 వేల ఫిర్యాదులందాయని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల రోజుల్లో అవినీతి ఆరోపణల కింద పోలీస్ శాఖలోనే 9 మంది ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డ్ స్థాయి వ్యక్తులపై కేసులు నమోదయ్యాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(విజిలెన్స్) సింధు పిళ్లై తెలిపారు. ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసినప్పటినుంచి రోజుకు 600 ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. వాట్సప్ హెల్ప్‌లైన్‌కు ఈ నెల ఆరవ తేదీవరకు 20,698 మెసేజ్‌లు అందాయన్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదుల్లో 5 శాతం పోలీస్ శాఖలో అవినీతిపై కాగా, మిగిలినన్నీ వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులని ఒక అధికారి చెప్పారు. కాగా, ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించామని వివరించారు. ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో అవినీతిని అంతమొందించేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ సూచన మేరకు ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (విజి లెన్స్) జి.సి.ద్వివేది తెలిపారు. ప్రస్తుతం ఆయనే ఈ హెల్ప్‌లైన్ వ్యవస్థకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఎవరిపైన ఫిర్యాదు వచ్చిందో సదరు అధికారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వివరించారు. ‘మాకు ఎవరిపైనైనా సాక్ష్యంతో సహా ఫిర్యాదు అందితే వెంటనే దానిపై సీనియర్ అధికారులకు సమాచారమిస్తాం. తర్వాత సదరు ఫిర్యాదుదారును పిలిచి మాట్లాడతాం. అలాగే అతడు ఇచ్చిన సాక్ష్యం క్లిప్‌ను రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తాం. సదరు ఫిర్యాదు నిజమేనని తేలితే నిందితుడిపై కేసు నమోదుచేసి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం..’ అని ఆయన వివరించారు. మొదట్లో ప్రతిరోజూ 2,300 కంటే ఎక్కువగా ఫిర్యాదులు అందేవి.. వీటిలో అధికంగా సదరు హెల్ప్‌లైన్ నంబర్లు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికే చేసేవారు. ఇదిలా ఉండగా, రోజంతా పనిచేసే ల్యాండ్‌లైన్ నంబర్ 1064కు వచ్చే ఫిర్యాదులను ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 20 మంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్ నిరంతరం నాలుగు కనెక్షన్లలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ విజిలెన్స్ అధికారి నేతృత్వంలో 9910641064 నంబర్ పనిచేస్తోంది.