నానీ కాదు...సుమ అట.. | Suma anchoring for baahubali audio lunch | Sakshi
Sakshi News home page

నానీ కాదు...సుమ అట..

Published Sat, Jun 13 2015 10:19 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

నానీ కాదు...సుమ అట.. - Sakshi

నానీ కాదు...సుమ అట..

తిరుపతి : యువ హీరో నానీ ఛాన్సు సుమ కొట్టేసింది. ఇది ఎలాగబ్బా అనుకుంటున్నారా?  అదేనండి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం సుమకు దక్కింది.  హీరో నానీ ఈ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించాల్సి ఉండగా, ప్రమాదవశాత్తు షూటింగ్లో అతడు గాయపడినట్లు సమాచారం. దాంతో నానీ యాంకరింగ్ చేసేందుకు వీలులేకపోవటంతో అతని స్థానంలో సుమ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విట్ చేశాడు. కాగా ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చే అభిమానులు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే రావాలని ఆయన కోరారు.

ఇక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో  బాహుబలి ఆడియో విడుదల వేడుకలకు ఎస్వీయూ స్టేడియం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ  కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, టెక్నీషియన్స్, సిబ్బంది హాజరుకానున్నారు. వీరంతా శనివారం ఉదయమే తిరుపతికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement