
డీజే ఆడియో: యాంకర్ సుమ షాక్
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక ఆదివారం శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. దిల్ రాజు నిర్మాత. ఆడియో విడుదల సందర్భంగా యాంకర్‌గా వ్యవహరించిన సుమకు చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ‘డీజే’ చిత్రంలోని ‘మెచ్చుకో..’ పాటను సుమ విడుదల చేయాలంటూ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్‌రాజు కోరడంతో సుమ ఆశ్చర్యపోయారు.
తొలిసారి ఓ పాటను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిందుకు ధన్యవాదాలంటూ ఆనందపడ్డారు. డీజేలోని పాటను విడుదల చేయడం ద్వారా చరిత్రలో తనకూ కొన్ని పేజీలుంటాయని సుమ అనడంతో వేడుకలో నవ్వులు పూశాయి.