
యాంకర్ సుమ మహాకుంభమేళాకు వెళ్లింది.

ఆమె ఒక్కరే కాదు తమన్నా సహా ఓదెల 2 సినిమా యూనిట్ అంతా కూడా కుంభమేళా వెళ్లారు.

అక్కడే ఓదెల 2 టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సుమ మెడలో రుద్రాక్షమాలతో కనిపించింది.

పనిలో పనిగా ప్రయాగరాజ్‌లో పవిత్రస్నానం ఆచరించింది.

ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమాయే ఓదెల 2.

తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంపత్ నంది కథ అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.





