బిగ్‌బాస్‌ ఫేమ్‌ హీరోగా 'రామ్ ఎన్‌ఆర్‌ఐ'.. ట్రైలర్‌ వచ్చేసింది! | Bigg Boss Fame Latest Movie Ram NRI Trailer Out Now | Sakshi
Sakshi News home page

Ram NRI Trailer: బిగ్‌బాస్‌ ఫేమ్‌ హీరోగా 'రామ్ ఎన్‌ఆర్‌ఐ'.. ట్రైలర్‌ వచ్చేసింది!

Published Mon, Jul 22 2024 8:11 PM | Last Updated on Mon, Jul 22 2024 8:11 PM

Bigg Boss Fame Latest Movie Ram NRI Trailer Out Now

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా, సీతా నారాయణన్‌ జంటగా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక.  ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహిస్తున్నారు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డైరెక్టర్ ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ.. ‘నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నా’ అని అన్నారు. నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా సినిమాను అందరూ ఆదరించండి’అని అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో రిలేట్ అయ్యాను. పుట్టిన ఊరుకి ఏం చేశామని ఎంతో మంది అనుకుంటారు. అలాంటి పాయింట్‌ను తీసుకుని కథ చేయడం గొప్ప విషయం. ఈ కథ ఏ ఒక్కరికీ నచ్చినా ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని అనిపించింది. ఇలాంటి మంచి చిత్రంలో కచ్చితంగా నటించాలని కోరుకున్నా. నిర్మాత మొవ్వా సత్యనారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందరూ చూసి మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement