బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం! | Bigg Boss 3 Telugu BB Express Entertainment | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

Published Wed, Aug 28 2019 9:28 PM | Last Updated on Thu, Aug 29 2019 1:34 PM

Bigg Boss 3 Telugu BB Express Entertainment - Sakshi

బిగ్‌బాస్‌ ఆరోవారంలోకి ఎంటరైందో లేదో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి రెడీ అయింది. గొడవలతో గరం మీద ఉన్న ఇంటి సభ్యులను కూల్‌ చేయడానికి బిగ్‌బాస్‌ ఓ ఫన్నీ గేమ్‌ ఆడించబోతున్నాడు. ఇక దొరికిందే చాన్సు అన్నట్టు అందరూ యాక్టింగ్‌ కుమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇంటి సభ్యులు చేసిన జర్నీని పక్కనపెట్టి వారితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టించాడు బిగ్‌బాస్‌. అదే బిగ్‌బాస్‌ బిగ్‌ ఎక్స్‌ప్రెస్‌... ఇక్కడ వినోదాలకు మాత్రమే చోటు అన్న రీతిలో తాజా ప్రోమో కనిపిస్తోంది. ఆటలు, పాటలు, డాన్సులతో బిగ్‌బాస్‌ హౌస్‌ దద్దరిల్లడం ఖాయం అని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే పునర్నవి-రవిని జంటగా చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న రాహుల్‌ ఊరికే ఉంటాడా అన్నది ఆలోచించాల్సిన విషయమే! సినిమాల్లోలాగా రాహుల్‌ దీన వదనంతో తన ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ పిల్ల ఉండేదంటూ తన లవ్‌స్టోరీ ఇంటిసభ్యులకు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో శ్రీముఖి పంచ్‌లు పేల్చుతోంది. అసలు రాహుల్‌ తన గతాన్ని చెబుతోంది పోయిన అమ్మాయిని తిరిగి దక్కించుకోవటం కోసమా.. కళ్ల ముందు కులాసాగా తిరుగుతున్న జంట మధ్య చిచ్చు పెట్టడానికా అన్న అనుమానం రాక మానదు. పైగా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రేమను ఎవరో తన్నేసుకుపోవడం సహించలేని రాహుల్‌ తన లైన్‌ క్లియర్‌ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇంట్లో మరో కొత్త జంట అలీ రెజా, శ్రీముఖిలు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. అయితే ఇది టాస్క్‌లో భాగమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ ప్రేమ జంటలను అడ్డుకునేందుకు ఇంటిసభ్యులు ఎవరైనా యత్నిస్తారా? లేక ఈ రెండూ జంటలూ హాయిగా డ్యూయెట్‌ సాంగ్‌ వేసుకుని ఎంజాయ్‌ చేస్తుంటాయా.. ఒకవేళ అదే జరిగితే రాహుల్‌ మొహం మాడిపోవడం ఖాయం. ఇంటి సభ్యుల ఎంజాయ్‌మెంట్‌ చూస్తుంటే నేటి ఎపిసోడ్‌ నిజంగానే జోరుగా కొనసాగనుంది అని అనిపించక మానదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement