
బిగ్‌బాస్ ఇచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్ రక్తపాతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో అలీ రెజా, హిమజ మధ్య జరిగిన గొడవ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో తలదూర్చిన తమన్నాపై కూడా అలీ రెజా విరుచుకుపడ్డాడు. ఈ టాస్క్ పెట్టిన చిచ్చు అంత తొందరగా చల్లారలేదు. చివరకు హిమజ.. అలీ రెజా కాళ్లు పట్టుకుని ఏడ్చే వరకు వెళ్లింది. తన నుంచి సారీ మాత్రమే ఆశించానని, కాళ్లు పట్టుకోమని అడగలేదని అలీ రెజా వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవలో హిమజ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కొడతాను అని బెదిరించినట్లు పదేపదే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే వ్యవహారాన్ని వీకెండ్‌లో నాగ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అలీ రెజాపై నాగ్ విరుచుకుపడ్డట్లు ఓ ప్రోమోను విడుదల చేశారు. తనకు డ్రెస్సింగ్ ఉంది కానీ కామన్‌సెన్స్ లేదంటూ అలీపై ఫైర్ అయ్యాడు. ఇంతవరకు హౌస్‌మేట్స్ చేసిన తప్పులను నవ్వుతూ సరిచేసేందుకు ప్రయత్నించిన నాగ్.. మొదటిసారిగా ఫైర్ అయినట్లు కనబడుతోంది. మరి ఈ వ్యవహారంలో నాగ్ ఇచ్చిన తీర్పు ఏంటో? రవికృష్ణకు గాయం కావడం, అతన్ని ప్రోత్సహించిన శ్రీముఖి, ఐడియా ఇచ్చిన మహేష్‌ను నాగ్ ఏవిధంగా మందలించాడో చూడాలి. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే మూడో వ్యక్తి ఎవరో రేపు తెలిసిపోనుంది. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ ప్రకారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment