స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ | Bigg Boss 3 Telugu: Himaja Eliminated In Ninth Week | Sakshi
Sakshi News home page

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

Published Sun, Sep 22 2019 10:57 PM | Last Updated on Tue, Sep 24 2019 12:52 PM

Bigg Boss 3 Telugu: Himaja Eliminated In Ninth Week - Sakshi

ఆటపాటలతో ఇంటి సభ్యులను ఆట ఆడించిన నాగార్జున‌.. బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. రిథమ్‌ ఆఫ్‌ లైఫ్‌ అంటూ డిఫరెంట్‌ పాటలు ప్లే చేస్తూ.. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయించాడు. వరుణ్‌ ఎంట్రీ ఇవ్వడం.. గద్దలకొండ గణేష్‌ మూవీ ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్‌ స్టేజ్‌పై దర్శనమివ్వడం.. హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేయడం... చివరకు హిమజ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించడం.. బయటకు వచ్చిన ఆమె హౌస్‌మేట్స్‌ గురించి చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించిన నాగ్‌ వారితో డ్యాన్సులు వేయించాడు. మెడ్లీ పాటలు అంటూ డిఫరెంట్‌ పాటలనుప్లే చేస్తూ.. ఒక్కో​టీమ్‌ నుంచి ఒక మెంబర్‌ను పిలిచి డ్యాన్స్‌చేయమన్నాడు. దీనికి మహేస్‌ జడ్జ్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. వరుణ్‌, పున్ను, బాబా, హిమజలు ఒక టీమ్‌లో ఉండగా మిగతా వారంతా మరో టీమ్‌లో ఉన్నారు. దీంట్లో భాగంగా పున్ను, హిమజ, రవి, బాబాలు బాగా డ్యాన్స్‌ చేశారని తెలిపాడు. బాబా భాస్కర్‌-శ్రీముఖి డ్యాన్స్‌లో శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్‌లో భాగుందని, డ్యాన్సులో బాబా బాస్కర్‌ బాగా చేశాడని తెలిపాడు.

ఈ టాస్క్‌ తరువాత.. గద్దలకొండ గణేష్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అంతాఆశ్చర్యానికి గురయ్యారు. వారికి వాల్మీకి ట్రైలర్‌నే ప్లే చేసి చూపించారు. శివజ్యోతి, హిమజ, పున్ను, వితికా, శ్రీముఖిలు వరుణ్‌కు ప్రపోజ్‌ చేయాలంటూ ఓ టాస్క్‌ను ఇచ్చాడు. అయితే ఈ టాస్క్‌లో శివజ్యోతి తెలంగాణ యాసలో ప్రపోజ్‌ చేసి విన్నర్‌గా నిలిచింది. చివరగా.. హిమజ ఎలిమినేట్‌ అయినట్టు వరుణ్‌ ప్రకటించాడు.

బయటకు వచ్చిన హిమజ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన జర్నీకి సంబంధించిన వీడియోను చూపి ఎమోషనల్‌ అయింది. బయట తనకు ఎదురైన పరిస్థితులను బట్టి.. ఎవ్వరితోనూ అంత ఈజీగా కలవలేనని చెప్పుకొచ్చింది. హౌస్‌లో తాను అలా ఉండే సరికి తనకెప్పుడు ఎవరూ సపోర్ట్‌ చేయలేదంటూ కన్నీరు పెట్టుకుంది. గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అంటూ హిమజతో ఆట ఆడించాడు. ఆమె గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అంటూ హౌస్‌మేట్స్‌ గురించి చెప్పాల్సి ఉంటుందని.. ఆ సమయంలో వారంతా ఐస్‌పై నిలిచి ఉంటారని టాస్క్‌ ఇచ్చాడు. శ్రీముఖి, రవి, వరుణ్‌, శివజ్యోతి గుడ్‌ అని.. వితికా, పున్ను, మహేష్‌ బ్యాడ్‌ అని.. బాబా భాస్కర్‌కు అగ్లీ అని పేర్కొంది. లివింగ్‌ ఏరియాలోంచి గార్డెన్‌ ఏరియాలోకి ఎవరు వెళ్లినా.. ఆ సమయంలో డోర్‌ తీస్తూ ఉండాలనే బిగ్‌బాంబ్‌ను మహేష్‌పై వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement