టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్‌ 3 గ్రాండ్‌ ఫినాలే | Bigg Boss Telugu Registered Highest TRPs For Its Grand Finale | Sakshi
Sakshi News home page

టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్‌ 3

Published Thu, Nov 14 2019 6:41 PM | Last Updated on Sun, Nov 17 2019 11:13 AM

Bigg Boss Telugu Registered Highest TRPs For Its Grand Finale - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 గ్రాండ్‌ ఫినాలే టీఆర్పీలో గత రెండు సీజన్‌ల ‍రేటింగ్‌ రికార్డును తిరగరాసింది.

హైదరాబాద్‌ : నాగార్జున-చిరంజీవి కాంబినేషన్‌లో అట్టహాసంగా జరిగిన బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, నానిలు ప్రెజెంట్‌ చేసిన తొలి రెండు సీజన్‌ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్‌ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. బిగ్‌బాస్‌ తెలుగు 3 గ్రాండ్‌ఫినాలేను నవంబర్‌ 3న స్టార్‌ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని రాహుల్‌ సిప్లీగంజ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 గ్రాండ్‌ఫినాలే టీఆర్పీలు వెల్లడై ఫైనల్‌ ఎపిసోడ్‌ ఏ రేంజ్‌లో వీక్షకులను ఆకట్టుకుందో తేటతెల్లం చేశాయి.

నాలుగున్నర గంటల పాటు సాగిన ఫైనల్‌ ఎపిసోడ్‌ 18.29 టీఆర్పీ రాబట్టిందని ఈ షో నిర్మాతలైన ఎండెమోల్‌ షైన్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్‌ షో ఇదేనని ట్వీట్‌ పేర్కొంది. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 1 గ్రాండ్‌ ఫినాలేకు 14.13 టీఆర్పీ, నాని ప్రెజెంట్‌ చేసిన సీజన్‌ 2 ఫినాలే 15.05 టీఆర్పీ రాబట్టాయి. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గ్రాండ్‌ఫినాలేలో విజేత రాహుల్‌కు చిరంజీవి టైటిల్‌ను ప్రదానం చేసే ఎపిసోడ్‌ చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్‌ మా నెట్‌వర్క్‌ ఉద్యోగి రాజీవ్‌ ఆలూరి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్‌, హీరోయిన్‌ క్యాథరిన్‌ త్రెసా సహా పలువురు సెలెబ్రిటీలు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో తళుక్కున మెరవడం ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో భారీ రేటింగ్‌లు దక్కాయి.​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement