
అలీ , ఫరాఖాన్, ఆర్.కె, అజీజ్ నజర్
అలీ రజీత్, అజీజ్, సూఫీ ఖాన్, సమైరా, ఫరాఖాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హైదరాబాద్ నవాబ్స్ 2’. 2006లో వచ్చిన ‘హైదరాబాద్ నవాబ్’ సినిమాకు ఇది సీక్వెల్. ఆర్.కె. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘హైదరాబాద్ నవాబ్స్ 2’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శక–నిర్మాత ఆర్.కె. మాట్లాడుతూ– ‘‘రియల్ ఎస్టేట్ కథాంశంతో తీసిన చిత్రమిది. పాత బస్తీ నేపథ్యంలో ఉంటుంది. రెండు గంటల పాటు మా సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.
హైదరాబాద్ లోకల్ కల్చర్‌ను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ధృవ సినిమాలో చిన్న పాత్ర చేశా.. టీవీ సీరియల్స్‌లో నటించాను. ‘హైదరాబాద్ నవాబ్స్ 2’లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు అలీ రజీత్. ‘‘ఈ సినిమాకు కథే హీరో. ఇందులో కామెడీ మెయిన్ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు అజీజ్. ‘‘ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు ఫరాఖాన్, సూఫీ ఖాన్, సమైరా, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment