బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో! | Bigg Boss 3 Telugu Is It Better To Maintain Distance With Shiva Jyothi | Sakshi
Sakshi News home page

సాయం చేయబోయి చేతులు కాల్చుకున్న అలీ!

Published Thu, Oct 3 2019 4:48 PM | Last Updated on Thu, Oct 3 2019 5:08 PM

Bigg Boss 3 Telugu Is It Better To Maintain Distance With Shiva Jyothi - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో కదిలిస్తే కన్నీళ్లే అనగానే గుర్తొచ్చే మొదటి, ఆఖరి వ్యక్తి శివజ్యోతి. ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్‌ జర్నీని చూసుకుంటే టాస్క్‌లో గట్టిపోటీనిచ్చే వ్యక్తుల్లో శివజ్యోతి ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న సూత్రాన్ని తను పాటించినంత కచ్చితంగా మరెవరూ ఆచరించరు. ఇక తన ఏడుపు గురించి సోషల్‌ మీడియాలో ఎన్నో ఫన్నీ మీమ్స్‌ పుట్టుకొచ్చాయి. ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా.. ముళ్లు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అన్న సామెత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శివజ్యోతి విషయంలో అదే జరుగుతోందని కొందరు అంటున్నారు.

అటు శివజ్యోతికి క్లోజ్‌ అయినవాళ్లకు మూడింది. ఇటు శివజ్యోతితో పెట్టుకున్నశ్రీముఖి ఎలిమినేషన్‌ చివరి అంచుల దాకా వెళ్లివచ్చింది. వివరంగా చూస్తే.. శివజ్యోతికి దగ్గరైనవాళ్లు ఒక్కొక్కరుగా బిగ్‌బాస్‌ ఇంటిని వీడి వెళ్లారు. ఏ తప్పు చేయని రోహిణి.. శివజ్యోతితో గుసగుసలు పెట్టినందుకుగానూ నామినేషన్‌ జోన్‌లోకి వచ్చి అకారణంగా ఎలిమినేట్‌ అయింది. ఆ తర్వాత తనకు దగ్గరివారైన అషూరెడ్డి, అలీ కూడా వెళ్లిపోయారు. ఇక వీరంతా వెళ్లిపోయే సమయంలో గుక్క తిప్పుకోకుండా ఏడ్చిన శివజ్యోతి మళ్లీ ఓ కొత్త జోడును వెతుక్కుంది. మంచోడని పేరుగాంచిన రవి దగ్గరకు వెళ్లి జంట కట్టగా చివరికి అతను కూడా బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పక తప్పలేదు. దీంతో శివజ్యోతికి కాస్త దూరంగా ఉంటే బెటర్‌ అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక బయట మంచి క్రేజ్‌ తెచ్చుకున్న అలీరెజాను బిగ్‌బాస్‌ టీం ఎలాగోలా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా తిరిగి తీసుకొచ్చింది.

అయితే బిగ్‌బాస్‌ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా కాస్త విభిన్నంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీముఖితో అంటీముట్టనట్టుగా వ్యవహరించడమే కాకుండా వరుణ్‌ టీంలో జాయిన్‌ అవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శివజ్యోతి, అలీల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎపిసోడ్‌లో కుళాయి కొట్లాట గేమ్‌లో శివజ్యోతిని గెలిపించాలని తహతహలాడాడు. ఈ విషయంలో శ్రీముఖి.. అలీకి మధ్య పెద్ద గొడవే జరిగింది. ‘తనకెందుకు సహాయం చేస్తున్నావు? టైటిల్‌ కూడా ఆమెకే వదిలేస్తావా?’ అన్న శ్రీముఖి ప్రశ్నకు వదిలేస్తానంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. అయితే అలీ చూపించిన అత్యుత్సాహానికి బిగ్‌బాస్‌ బ్రేక్‌ వేశాడు. అలీ చేసిన తప్పిదానికి బిగ్‌బాస్‌ అలీతోపాటు, శివజ్యోతిని అనర్హులుగా ప్రకటించాడు. అలీ గేమ్‌ ఆడాలి కానీ ఎమోషన్‌లో ఇరుక్కుపోవడం బాలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement