బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత కంటెస్టెంట్‌లకు అప్పటి వరకు రాని గుర్తింపు వస్తుంది. కొందరికి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ కూడా వస్తుంది. అయితే చాలామందికి ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవట్లేదు. షో నుంచి బయటకు రాగానే చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేక ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. బిగ్‌బాస్ తర్వాత వచ్చే క్రేజ్ వాళ్ల కెరీర్‌కు మాత్రం ఉపయోగపడటం లేదు. తాజాగా ఇదే విషయంపై సీజన్-3 ఫైనలిస్ట్ అలీ రెజా స్పందించారు.
'మేం షో నుంచి బయటకు వచ్చాక దాదాపు అందరికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మాకు హైప్ ఉన్న ఆ నాలుగు నెలల్లోనే కరోనా వచ్చింది. లాక్‌డౌన్ మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది. దీంతో బయటకు వెళ్లి ఏదైనా చేసుకునే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వెంటనే సీజన్ 4 కూడా వచ్చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. బిగ్‌బాస్ షోలో అర్జున్ రెడ్డిలా గుర్తింపు పొందిన అలా రెజా ఫైనలిస్ట్‌గా మిగిలాడు.
ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ కనిపించాడు. రీసెంట్‌గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించాడు. నిజానికి బిగ్‌బాస్ సీజన్-3తో పోలిస్తే ఆ తర్వాత పాల్గొన్న కంటెస్టెంట్‌లు వర్క్ పరంగా బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖిల్, సోహైల్ తాము చేస్తున్న సినిమాలను ప్రకటించి దూకుడు పెంచారు. ఇక యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చిన లాస్య సైతం బిగ్‌బాస్ తర్వాత బిజీ అయ్యింది.
చదవండి : 'షో వల్ల కెరీర్ నాశనమైంది.. అదే నేను చేసిన తప్పు'
‘బిగ్‌బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
Comments
Please login to add a commentAdd a comment