
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్
భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో మూవీలో చేస్తున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment