Bigg Boss Telugu shocking Eliminations: బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్స్‌లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్‌ను ఏంటో ఓసారి చూద్దాం.
సీజన్-1
బిగ్‌బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
సీజన్-2
బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్‌గా అనిపించింది. దీంతో ఇది అన్‌ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించారు.
సీజన్-3
అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్‌బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
సీజన్-4
బిగ్‌బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే.
సీజన్-5
బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్‌తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్‌ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్‌ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి
కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్
Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా?
Comments
Please login to add a commentAdd a comment