Bigg Boss 5 Telugu: Is Priyanka Reason Behind Ravi Elimination? - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5 Elimination: సన్నీ వాడిన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వల్ల కాజల్‌ సేవ్‌ అయ్యిందా?

Published Sun, Nov 28 2021 11:37 AM | Last Updated on Sun, Nov 28 2021 12:50 PM

Bigg Boss Telugu 5: Is Anchor Ravi Eliminated Because Of Pinky - Sakshi

Bigg Boss Telugu 5: Is Anchor Ravi Eliminated బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఈవారం షాకింగ్‌ ఎలిమినేషన్‌ జరిగిందని తెలుస్తుంది.ఎవరూ ఊహించని విధంగా యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్‌ అవ్వడం ఏంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఇది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్రిం‍గ్‌ బ్యాక్‌ రవి అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.

స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా టాప్‌5లో ఉండాల్సిన రవిని బయటకు పంపించేయడం అన్యాయమని భావిస్తున్నారు. అయితే మరికొందరేమో పింకీని కాపాడటానికి రవిని కావాలనే ఎలిమినేట్‌ చేశారనే ప్రచారమూ జరుగుతుంది. మానస్‌తో కంటెంట్‌ ఇవ్వడం తప్పా కొన్ని వారాలుగా పింకీ ఆట కూడా యాక్టివ్‌గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది.

ఫ్యాన్‌ బేస్‌ విషయంలోనూ రవితో పోలిస్తే పింకీకి తక్కువగానే ఉందని, మరి అలాంటప్పుడు పింకీ ఎలా సేవ్‌ అయిందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. సన్నీ దగ్గరున్న ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కాజల్‌ కోసం వాడటం వల్ల రవి బలయ్యాడనే వార్త కూడా బయటకు వచ్చింది.  మరి లీకు వీరులు చెప్పినట్లుగా నిజంగానే ఈవారం రవి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చాడా లేదా ఇందులో మరేదైనా ట్విస్ట్‌ ఉందా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement