Bigg Boss Fame Ali Reza Wife Masuma Blessed With Baby Girl - Sakshi
Sakshi News home page

Ali Reza: ఏంజెల్‌కు తండ్రినని సగర్వంగా చెప్తున్నా.. అలీ రెజా

Published Tue, Oct 19 2021 6:22 PM | Last Updated on Tue, Oct 19 2021 7:13 PM

Bigg Boss Fame Ali Reza Wife Masuma Blessed With a Baby Girl - Sakshi

Ali Reza- Masuma Wecome Baby Girl: బుల్లితెర నటుడు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అలీ రెజా తండ్రయ్యాడు. ఆయన సతీమణి మసుమ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు అలీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. 'అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని రాసుకొచ్చాడు. మరో పోస్ట్‌లో కూతురును ఎద్దుకుని ముద్దాడిన ఫొటోలు షేర్‌ చేశాడు. కానీ ఆ ఫొటోల్లో పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఈ శుభవార్త తెలిసిన సెలబ్రిటీలు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు, అభిమానులు అలీ రెజాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

కాగా తెలుగు సిరీయల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేసిన అలీ ఆ మధ్య నాగార్జునతో వైల్డ్‌ డాగ్‌ అనే సినిమా కూడా చేశాడు. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’అనే మరో సినిమా​ చేస్తున్నట్లు ప్రకటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement