బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌ | Mahesh Fires On Ali Reza In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌస్‌లో మాటల యుద్ధం

Aug 20 2019 4:27 PM | Updated on Aug 20 2019 8:40 PM

Mahesh Fires On Ali Reza In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ ఐదో వారానికి గానూ జరిగిన నామినేషన్‌ ప్రక్రియ పెద్ద గొడవకు దారి తీసినట్టు కనిపిస్తోంది. కెప్టెన్‌ అయిన కారణంగా అలీరెజాకు బిగ్‌బాస్‌ ప్రత్యేక అధికారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యుల్లోంచి నలుగురు పేర్లను సూచించమనడం.. అందులో ఒకర్ని నేరుగా నామినేట్‌ చేసే అధికారాన్ని అలీరెజాకు ఇవ్వడం.. దీంతో బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు బిగ్‌బాస్‌కు అలీరెజా తెలపడం తెలిసిందే. 

బాబా భాస్కర్‌ మహేష్‌ మాటలతో ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నాడని శ్రీముఖి, అలీరెజా, వరుణ్‌ సందేశ్‌లు మాట్లాడుకున్నారు. అయితే ఇదే విషయంపై నేడు హౌస్‌లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో అందరికీ ఫన్నీ అవార్డులు ఇచ్చిన నాగ్‌.. పుల్లలు పెట్టే అవార్డును మహేష్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేయడం.. దీనికి సంజాయిషీ ఇచ్చుకుంటున్న సందర్భంలో మహేష్‌ మధ్యలో రావడంతో పుల్లలు పెట్టకు అంటూ అలీరెజా అనడంతో మహేష్‌ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరి మధ్య జరిగే గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement