‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’ | Bigg Boss 3 Telugu Ali Reza Slams Varun Sandesh | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

Published Fri, Oct 11 2019 11:27 AM | Last Updated on Tue, Oct 15 2019 6:16 PM

Bigg Boss 3 Telugu Ali Reza Slams Varun Sandesh - Sakshi

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు హంట్‌ అండ్‌ హిట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్‌కు అలీ రెజా, రాహుల్‌ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్‌తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్‌ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్‌బాస్‌ గేమ్‌ వదలదు అంటూ మాట్లాడిన అలీ, డైరెక్ట్‌ ఎలిమినేట్‌ చేయమంటే శ్రీముఖిని లగేజ్‌ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్‌ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్‌ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది.

రాహుల్‌కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్‌, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్‌బాస్‌ రాహుల్‌కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్‌తో వాగ్వాదానికి దిగిన రాహుల్‌. మహేశ్‌ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్‌ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది. ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడంటూ వరుణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్‌కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడిన  వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్‌కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్‌.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు.

ఇక స్టార్‌ ఆఫ్‌ దహౌస్‌గా నిలిచిన వరుణ్‌, శివజ్యోతికి స్పెషల్‌ డిన్నర్‌ రావటంతో ఇంటిసభ్యులు గుటకలు వేసినా ఏం లాభం లేదని తెలుసుకుని మిన్నకుండిపోయారు. ఇక మహేశ్‌ వీడియో చూసిన తర్వాత బాగా హర్ట్‌ అయినట్టు కనిపించాడు. ఇక నుంచి తాను ఎవరితో మాట్లాడను అంటూ శ్రీముఖి, మాస్టర్‌పై అలిగాడు. నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అయినా నాపై జోకులు వేస్తున్నారు. శ్రీముఖి అవసరం కొద్దీ మెదులుతుంది. నామినేషన్‌కు వెళ్లకుండా ఉండటానికి అందరితో క్లోజ్‌గా ఉంటుంది అని  అతని అభిప్రాయాన్ని శివజ్యోతితో పంచుకున్నాడు. అలీరెజా గుట్టు బయటపడిందని, మహేశ్‌ చిత్రగుప్తులవాడు అని వరుణ్‌, వితిక అభిప్రాయపడ్డారు.

బిగ్‌బాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఇంటిసభ్యులు రచ్చరచ్చ చేశారు. వింత వింత వేషధారణలతో డాన్స్‌ చేశారు. బిగ్‌బాస్‌ బర్త్‌డే ఇంటిసభ్యుల చావుకొచ్చింది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బర్త్‌డే సందర్భంగా బిగ్‌బాస్‌ కేకుల మీద కేకులు పంపించాడు. మొదటి కేక్‌ను ఆవురావురుమంటూ తిన్నారు కానీ నాలుగో కేక్‌కు వచ్చేసరికి అపసోపాలు పడుకుంటూ తినేశారు. ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో 80 రోజులు గడిచిపోయాయి. రానురాను టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కడదాకా పోరాడుతారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement