బిగ్‌బాస్ హౌస్‌లో ఆరోవారానికి గానూ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్ అయిన కారణంగా శివజ్యోతికి మినహాయింపును ఇచ్చిన బిగ్‌బాస్.. మిగిలిన వారందర్నీ వారి సన్నిహితులతో కలిసి జంటగా ఏర్పడాలని ఆదేశించడం.. అందులోంచి ఒకరు సేవ్ అవడం.. మరొకరు నామినేషన్స్‌లోకి వెళ్లడం.. బిగ్‌బాస్ వీక్లి న్యూస్‌ను ప్రచురించడం హైలెట్‌గా నిలిచాయి.
తనకు బయట చాలా మంది స్నేహితులు ఉన్నారని.. తనంటే కోసుకునే వాళ్లు ఉన్నారని.. నువ్వెంత? అంటూ పునర్నవిని ఉద్దేశించి రాహుల్ అన్నాడు. దీంతో పునర్నవి అలిగింది. పునర్నవి-రాహుల్ మధ్య జరిగిన గొడవను సద్దుమణిగేలా చేయడం కోసం వరుణ్ ప్రయత్నించాడు. బిగ్‌బాస్ వీక్లి పేపర్‌ను పంపించాడు. దాంట్లో ఇంటి గురించి సంబంధించిన వార్తలను ప్రచురించాడు. అలీ డ్యాన్సులు, రవి మీసం, హౌస్‌లో ఉండే గ్రూప్స్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించాడు. ఇక దానిపై హౌస్‌లో చర్చించుకున్నారు.
నామినేషన్ ప్రక్రియ కోసం బాబా భాస్కర్-మహేష్, హిమజ-శ్రీముఖి, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, అలీ-రవిలు జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటల్లోంచి మిగిలిన ఇంటి సభ్యులందరూ ఓటింగ్ ద్వారా ఒకర్ని సేవ్, మరొకర్ని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఒకవేళ ఓటింగ్ విషయంలో టై అయితే కెప్టెన్ శివజ్యోతి నిర్ణయం ఫైనల్ అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలో మహేష్, పునర్నవి, రవి, హిమజలు నామినేట్ అయ్యారు. వితికా-రాహుల్ విషయంలో టై కాగా.. చివరకు శివజ్యోతి నిర్ణయంతో వితికా సేవ్ అయిపోయింది.
ఈ నామినేషన్స్‌లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. వితికా తన భర్తను నామినేట్ చేసి, పునర్నవిని సేవ్ చేసింది. అప్పటికే పునర్నవికి ఐదు ఓట్లు వచ్చాయి కాబట్టి మళ్లీ పునర్నవిని నామినేట్ చేస్తే ఫీల్ అవుతుందేమోనని వరుణ్‌ను నామినేట్ చేసినట్లు కనబడుతోంది. తాను ఒక్క ఓటు పునర్నవికి వేసినంత మాత్రాన తన భర్తకు వచ్చే నష్టం లేదనుకుని పునర్నవిని సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా విషయంలో.. పునర్నవి వేసే ఓటుతో తేలే అవకాశం ఉన్నా.. రాహుల్‌కు ఓటు వేసి టైగా మార్చేసింది. దాంతో రాహుల్, వితికాలకు 4 ఓట్లు పడ్డాయి. కెప్టెన్ అయిన శివజ్యోతి తన నిర్ణయంతో వితికాను సేవ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
చివరగా బిగ్‌బాస్ ఆదేశం మేరకు ఇంతవరకు సేవ్ అయిన ఇంటి సభ్యుల్లోంచి వరుణ్ సందేశ్‌ను శివజ్యోతి నేరుగా నామినేట్ చేసింది. నామినేషన్ విషయం వచ్చేసరికి స్నేహితులు అని చూడకూడదని వరుణ్, వితికా మాట్లాకున్నారు. మహేష్ తన స్ట్రాటజీని బయటపెట్టాడు. మొదటగా అలీని నామినేట్ చేద్దామని అనుకున్నానని, అయితే తాను నామినేషన్‌లో ఉండేసరికి తనకంటే తక్కువ పర్ఫామెన్స్ ఇచ్చేవాడిని సెలెక్ట్ చేయాలనుకున్నాని తెలిపాడు. అందుకే తాను అలీని సేవ్ చేసి రవిని నామినేట్ చేశానని.. రవి ఉంటేనే తాను సేవ్ అయ్యే అవకాశం ఉంటుందని వరుణ్, వితికాలతో చెప్పుకొచ్చాడు. మరి మహేష్ స్ట్రాటజీ నిజమవుతుందా? ఆరో వారంలో ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment