
పదమూడో వారానికిగానూ వితికా ఎలిమినేట్ అవడంతో వరుణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక్కడో చిన్న ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వితికా హౌస్‌ను వీడేముందు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ శ్రీముఖి ఆమె చెవిలో గుసగుసలాడింది. అనంతరం బయటకు వచ్చిన వితికాతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్ ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టి వారికి చెప్పాలనుకునేటివి ఏమైనా ఉంటే చెప్పాలన్నాడు. ఈ సమయంలో వితికా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ నిర్మొహమాటంగా వెల్లడించింది. తను బయటకు రావడానికి కారణం శివజ్యోతి అని బల్లగుద్ది చెప్పింది. లేకపోతే షో చివరిదాకా ఉండేదాన్నేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. శివజ్యోతి తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వితికా అంగీకరించింది. ‘నాకన్నా ఒక స్టెప్పు ఎక్కువే నువ్వు. అది నేను ఒప్పుకుంటున్నా’నంటూ శివజ్యోతికి తెలిపింది. కాగా వరుణ్.. శివజ్యోతి కన్నా వితికా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నామినేషన్‌లో తన స్థానాన్ని భార్యకు ఇచ్చేసిన విషయం తెలిసిందే! అయితే ఇప్పుడు వితికా.. శివజ్యోతే తనకన్నా స్ట్రాంగ్ అని ఒప్పుకోవటం గమనార్హం.
ఇక ఎవరి గురించి చెడుగా చెప్పాలనుకోడవం లేదంటూనే రాహుల్‌కు చురకలంటించింది. ‘నామినేషన్ తర్వాత నుంచి మాతో దూరంగా ఉంటున్నావు. మాతో నువ్వు ఫేక్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నావేమో’ అని అనుమానంగా ఉందని చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నంతమాత్రాన ఫేక్ రిలేషన్ కాదని రాహుల్ తిరుగు సమాధానమిచ్చాడు. అనంతరం ‘అలీ ఉండాలి, నేను వెళ్లిపోవాలనుకున్నాను’ అన్న విషయాన్ని వితికా వెల్లడించింది. ‘ఎలిమినేట్ అయి వెళ్లిపోవటం, తిరిగి రావటం నీ తప్పు కాదు’ అంటూ అలీకి ధైర్యం నూరిపోసింది. బాబా భాస్కర్‌తో.. మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి, తనకు ఒక దోసె కూడా ఎక్కువగా ఇవ్వండి అని ఆర్డర్ వేసింది. చివరగా వరుణ్, శ్రీముఖిల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టడానికి చాలాసేపు తటాపటాయించింది. వరుణ్ ఏడ్చినందుకుగానూ అతని బెలూన్‌ను పగలగొట్టింది. శ్రీముఖిని కరెంట్‌తో పోల్చుతూ ఆమె అసలు అలసిపోదని ఎప్పటికీ ఎనర్జెటిక్‌గా ఉంటుందని వితికా ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment