బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌! | Bigg Boss 3 Telugu Netizens Reaction On Alireza Elimination | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

Published Sun, Sep 8 2019 7:38 PM | Last Updated on Sun, Sep 8 2019 7:42 PM

Bigg Boss 3 Telugu Netizens Reaction On Alireza Elimination - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో అలీరెజా... మోస్ట్‌ అగ్రెసివ్‌గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్‌. టాస్క్‌లో చురుగ్గా పాల్గొంటూ.. గేమ్‌ను మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్రమంలో ఒక్కోసారి ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవలు జరుగుతూ ఉంటాయి. దాదాపు అందరితో గొడవలు పెట్టుకున్న అలీ.. నేడు ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అలీ ఎలిమినేట్‌ కావడంపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అలీ రెజా ఎలిమినేట్‌ అవుతాడని అస్సలు ఊహించలేదని, అతను లేకుంటే షో చూడటం కూడా వేస్ట్‌ అని, టాస్క్‌లు చేసే ఏకైక వ్యక్తి అని అంటూ అతని ఎలిమినేషన్‌ పట్ల అందరూ స్పందిస్తున్నారు. అలీకి ఉన్న అగ్రెసివ్‌నెస్‌ మూలాన్నే ఎలిమినేట్‌ అయ్యాడని, కోపంలో ప్రవర్తించే విధానం, ఆ సమయంలో నోటికి ఎంతొస్తే అంత అనడం లాంటి కారణాలు ఓటింగ్‌ను దెబ్బతీశాయని తెలుస్తోంది. 

తమన్నాతో గొడవ, మహేష్‌తో వాగ్వాదం, హిమజ విషయంలో అలీ ప్రవర్తనపై నెగెటివిటీ పెరగడం, టాస్క్‌ విషయంలో వరుణ్‌తో గొడవపడటం ఇలా చాలా విషయాల్లో అలీ తన టెంపర్‌ను కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. అందరితో కలిసే ప్రయత్నం చేస్తున్నా.. అతనికి గల కోపమే శత్రువుగా మారింది. మరి అలీరెజా ఎలిమినేట్‌ అయితే.. శివజ్యోతి, రవి, శ్రీముఖిల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగనుందో తెలియాలంటే ఇంకొంచెం సమయం వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement