Chiranjeevi Godfather Censor Completed Says Director Mohan Raja - Sakshi
Sakshi News home page

Godfather: చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌' సెన్సార్‌ పూర్తి.. డైరెక్టర్‌ ట్వీట్‌ వైరల్‌

Published Fri, Sep 23 2022 4:23 PM | Last Updated on Fri, Sep 23 2022 7:25 PM

Chiranjeevi Godfather Censor Completed Says Director Mohan Raja - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్‌ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలె మేకర్స్‌  తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్‌ మోహన్‌ రాజా మరో అప్‌డేట్‌ను వదిలారు.

ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది అని తెలిపారు. అంతేకాకుండా సెన్సార్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి మ్యాజిక్‌ చేయనుందన్నది చూడాల్సి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement