Salman KhanChiranjeevi Dance Number In God Farther: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ పాట పాడతారనే వార్త కూడా వచ్చింది. సల్మాన్ నటించనున్న వార్త నిజమేనని ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ పేర్కొన్నారు. అలాగే బ్రిట్నీ పాడతారా? లేదా అనే విషయం గురించి కూడా స్పష్టం చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి సార్, సల్మాన్ సార్ కలసి డ్యాన్స్ చేయడం అనేది నిజంగా మాకు పెద్ద విషయం. అందుకే ఈ పాట స్థాయి కూడా పెద్దగా ఉండాలి. ఓ పెద్ద ఆర్టిస్ట్ (సింగర్, ఆర్టిస్ట్) కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం. కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీలతో మాట్లాడుతున్నాం. వాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆడియో కంపెనీలతో మాట్లాడాలి.
ఎందుకంటే విదేశీ ఆర్టిస్ట్‌లకు ఈ ఆడియో కంపెనీలతో మంచి అనుబంధం ఉంటుంది.. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. బ్రిట్నీని సంప్రదించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఆమెతో తెలుగు పాట పాడించాలా? లేక ఇంగ్లిష్ ట్రాక్ పాడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు’’ అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment